అంతరిక్ష పరిశోధనలో వరుస సక్సెస్ లతో దూకుడు మీదున్న ఇస్రో(ISRO)లో విషాదఛాయలు అలుముకున్నాయి. ఇస్రోలో విధులు నిర్వహిస్తున్న ఓ ప్రముఖ శాస్త్రవేత్త వలర్మతి (50) గుండెపోటుతో మరణించారు. వలర్మతి(ISRO Scientist Valarmathi) పేరు ఎవరికి తెలియకపోయినాఇస్రో చేపట్టే ప్రోయోగానికి ముందు రాకెట్ లాంచింగ్ కౌంట్ డౌన్ ను గంభీరంగా వినిపించే గొంతు వలర్మతిదే.
ఇస్రోలో కౌంట్ డౌన్ విధులు నిర్వహిస్తున్న వలర్మతి గుండెపోటుతో చెన్నైలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆమె చివరి సారిగా చంద్రయాన్-3 లాంచింగ్ సమయంలో తన స్వరం వినిపించారు. ఇన్నాళ్లు ఇస్రోలో ఆమె గొంతుతో కౌంట్ డౌన్ చెబుతుండగా అనేక రాకెట్లు రయ్యి మంటూ దూసుకువెళ్లగా అలాంటి గొంతు ఇక మూగబోయింది. దీంతో ఇస్రోలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆమె(ISRO Scientist Valarmathi) మృతిపట్ల పలువురు సంతాపం తెలుపుతున్నారు.