మెరీడియన్ లో బిర్యానీలోకి పెరుగు అడిగాడు.. ప్రాణాలు కోల్పోయాడు

-

హైదరాబాద్ బిర్యానీకి ఉన్న డిమాండ్ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సెలబ్రేషన్ అనగానే బిర్యానీ గుర్తొస్తుంది. హైదరాబాద్ లో అనేక రెస్టారెంట్లు టేస్టీ బిర్యానీ కి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారాయి. వీటిలో పంజాగుట్ట నడిబొడ్డున ఉన్న మెరీడియన్ రెస్టారెంట్(Meridian Restaurant) కూడా ఉంటుంది. ఈ రెస్టారెంట్లో బిర్యానీ చాలా బాగుంటుందని కస్టమర్ల అభిప్రాయం. అయితే ఓ కస్టమర్ ఈ హోటల్ లో బిర్యానీ తిందామని వచ్చి.. హత్యకి గురికావడం సంచలనంగా మారింది. ఈ ఘటనతో అక్కడున్నవారంతా ఒక్కసారిగా షాక్ కి గురయ్యారు. వివరాల్లోకి వెళితే…

- Advertisement -

పాతబస్తీ చాంద్రాయణగుట్ట కి చెందిన లియాఖత్ అనే వ్యక్తి పంజాగుట్ట చౌరస్తా లోని మెరిడియన్ హోటల్ లో బిర్యానీ తినేందుకు వెళ్ళాడు. బిర్యానీ తింటూ ఎక్స్ ట్రా పెరుగు కావాలని అక్కడున్న సిబ్బందిని కోరాడు. అలా ఇవ్వడం కుదరదు అంటూ సిబ్బంది వారించడంతో వివాదం మొదలైంది. ఇది కాస్త తీవ్ర రూపం దాల్చడంతో సిబ్బంది అతనిపై దాడికి దిగారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్నారు. సిబ్బంది తోపాటు లియాఖత్ ని పోలీస్ స్టేషన్ కి తరలించారు. స్టేషన్లో పోలీసులతో మాట్లాడుతుండగా లియాఖత్ స్పృహతప్పి పడిపోయాడు. పోలీసులు వెంటనే అతనిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ లియాఖత్ ప్రాణాలు విడిచాడు. దీంతో పోలీసులు లియాఖత్ మృతదేహాన్ని గాంధీ హాస్పిటల్ మార్చురీకి తరలించారు.

విషయం తెలుసుకున్న మృతిని బంధువులు గాంధీ ఆసుపత్రి వద్ద ఆందోళన చేపట్టారు. దాడికి గురైన వ్యక్తిని వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లకుండా పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లడం వల్లే అతను మరణించాడని బంధువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పంజాగుట్ట పోలీస్ స్టేషన్ కు ఎమ్ఐఎమ్ ఎమ్మెల్సీ మీర్జా రెహమత్ బేగ్ చేరుకుని మృతుని కుటుంబానికి న్యాయం జరిగేలా చూడాలని పోలీసులను కోరారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మెరీడియన్ సిబ్బందిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఈ కేసులో మెరీడియన్ హోటల్ విమర్శల పాలవుతోంది. ఎక్స్ట్రా పెరుగు అడిగితే ప్రాణాలు తీసేస్తారా అంటూ పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఫేమస్ బిర్యానీ హోటల్ గా పేరున్న మెరీడియన్ రెస్టారెంట్(Meridian Restaurant) అభాసుపాలవుతోంది.

Read Also: చంద్రబాబుకి ప్రాణహాని ఉంది – అడ్వకేట్ లూథ్రా సంచలన వ్యాఖ్యలు
Follow us on: Threads, Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Pawan Kalyan | చిన్న కొడుకుకి అగ్నిప్రమాదం… సింగపూర్ వెళ్లనున్న పవన్ కళ్యాణ్

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్(Pawan Kalyan) చిన్న కుమారుడు మార్క్...

LEAP Model | ఏపీ విద్యా వ్యవస్థలో మార్పులు… కొత్తగా LEAP మోడల్

LEAP Model | ఏపీ సర్కార్ ఈ నెలలో ఎడ్యుకేషన్ మోడల్...