పెరిగిన ఎన్నికల స్పీడ్.. తెలంగాణ ఈసీ అనూహ్య నిర్ణయం

-

తెలంగాణలో ఎన్నికల జోష్ పెరిగింది. అధికార పార్టీ నుంచి ప్రతిపక్షాల వరకు ఎన్నికల ప్రచారంలో నిమగ్నమయ్యారు. అధికారం చేజిక్కించుకునేందుకు వ్యూహ ప్రతివ్యూహాలు రచిస్తున్నారు. ఓటర్లను ఆకట్టుకునేందుకు పోటాపోటీగా వరాల జల్లులు కురిపిస్తున్నారు. ఈ క్రమంలో రాష్ట్ర ఎన్నికల కమిషన్ కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ ఎలక్షన్స్ పై స్పీడ్ పెంచిన ఈసీ.. ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లను మొదలుపెట్టింది. ఎలక్షన్స్ కు కేవలం రెండు నెలలు మాత్రమే ఉండడంతో ఓటర్ల జాబితా తయారీ, పోలింగ్ బూత్ ల ఏర్పాట్లు తదితర అంశాలపై అధికారులతో వరుస సమీక్షలు నిర్వహిస్తోంది. ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ జిల్లాల కలెక్టర్లతో తరచూ సమీక్షలు జరుపుతున్నారు. ఎలక్షన్ల నిర్వహణలో ఎలాంటి అవకతవకలు జరగకుండా వారికి దిశా నిర్దేశం చేస్తున్నారు.

- Advertisement -

ఈ క్రమంలో ఈసీ మరో అనూహ్య నిర్ణయం తీసుకుంది. తెలంగాణ ఎన్నికల ప్రచారకర్తగా ట్రాన్స్ జెండర్ ను నియమించింది. వరంగల్ కి చెందిన ట్రాన్స్ జెండర్ లైలాను ఎంపిక చేసింది. ఓటు హక్కు ప్రాముఖ్యత, ఓటర్ల జాబితాలో మార్పులు, చేర్పులు ఎలా చేసుకోవాలనే అంశాలపై ఎన్నికల కమిషన్ తో కలిసి లైలా ప్రచారం చేయనున్నారు. ఎన్నికల ప్రచారకర్తగా సినీ, క్రీడా రంగానికి చెందిన సెలబ్రిటీలను ఈసీ ఎంపిక చేసుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ప్రతీ ఎన్నికల్లోనూ సినీ, క్రీడా రంగానికి చెందిన వారిని ఎంచుకుంటుంది. వీరితో ఓటు హక్కు ప్రాధాన్యతపై ఎన్నికల సమయంలో ప్రచారం చేయిస్తూ ఉంటుంది.

కానీ, ఈ సారి వినూత్నంగా ట్రాన్స్ జెండర్ ను ఈసీ ఎంపిక చేసింది. వరంగల్ లోని కరీమాబాద్ కి చెందిన లైలా జిల్లాలోని ట్రాన్స్ జెండర్లకు నాయకత్వం వహిస్తున్నారు. అలాగే జిల్లాలో పలు సేవా కార్యక్రమాలు కూడా ఆమె చేపడుతున్నారు. అధికారులతో వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో ట్రాన్స్ జెండర్ల కోసం వారంలో ఒకరోజు ప్రత్యేక క్లినిక్ ను లైలా ఏర్పాటు చేయించారు. జిల్లాలో దాదాపు 3,600 మందికి పైగా ట్రాన్స్ జెండర్లు ఉండగా.. వారికి లైలా నాయకత్వం వహిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Sesame Seeds | చలికాలంలో తెల్ల నువ్వులు ఎంత మ్యాజిక్ చేస్తాయో తెలుసా..

Sesame Seeds | చలికాలంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా పెద్ద టాస్క్...

Jagapathi Babu | రేవతి కుటుంబాన్ని నేను పరామర్శించా: జగపతిబాబు

Jagapathi Babu | సంధ్య థియేటర్ ఘటన రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా...