Paneer Bonda Recipe | కావలసిన పదార్థాలు:
సెనగపిండి: అరకప్పు, మైదా: రెండు టేబుల్ స్పూన్లు, కారం: అరచెంచా, వంటసోడా: చిటికెడు, పనీర్ తురుము: కప్పు, మొక్కజొన్న పిండి: చెంచా, అల్లంవెల్లుల్లి పేస్టు: అర చెంచా, గరంమసాలా: పావుచెంచా, జీలకర్రపొడి : పావుచెంచా, ఉప్పు: తగినంత నూనె: వేయించేందుకు సరిపడా.
తయారీవిధానం:
ముందుగా ఓ గిన్నెలో పనీర్ తురుము, మొక్కజొన్న పిండి, అల్లంవెల్లుల్లి పేస్టు, గరం మసాలా, జీలకర్ర పొడి, తగినంత ఉప్పు వేసుకుని కలిపి పెట్టుకోవాలి. అలాగే మరో గిన్నెలో సెనగపిండి, మైదా, కారం, కొద్దిగా ఉప్పు, వంటసోడా వేసుకుని కలిపి నీళ్లు పోస్తూ బజ్జీల పిండిలా చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయిని పెట్టి వేయించేందుకు సరిపడా నూనె వేయాలి.
అది వేడెక్కాక కొద్దిగా పనీర్ మిశ్రమాన్ని తీసుకుని ఉండలా చేసుకుని ముందుగా కలిపి పెట్టుకున్న బజ్జీల పిండిలో ముంచి కాగుతున్న నూనెలో వేసి ఎర్రగా వచ్చే వరకు వేయించుకోవాలి. అలానే మిగిలిన పిండితో పనీర్ బోండాలన్నీ(Paneer Bonda Recipe) చేసుకోవాలి. ఏదైనా సాస్ తో వేడి వేడిగా సర్వ్ చేసేయండి.