Protect your vaginal Health by avoiding over consumption of these drinks: నిద్ర లేచింది మొదలు కుటుంబ సభ్యుల గురించి ప్రతి క్షణం ఆలోచించే మహిళాలు తమ ఆరోగ్యం గురించి ఏమాత్రం పట్టించుకొరు. వారి జీవన శైలిలో వచ్చే మార్పులను కూడా పట్టించుకొకుండా.. నిత్యం శ్రమిస్తారు. ఈ ఉరుకుల, పరుగుల జీవితంలో వారు సరైన పోషకాహారం తీసుకోరు. తమ శరీరం పైకూడా వారు శ్రద్ద చూపించారు. దీంతో వారిలో అనేక ఆరోగ్య సమస్యలు వస్తుంటాయి. అయితే స్త్రీలు కొన్ని నిత్యజీవితంతో తీసుకొనే డ్రింక్స్ వారి శరీర, జననేంద్రియ ఆరోగ్యనికి పూర్తిగా హాని కలిగిస్తాయి. అవీ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..!
ప్రస్తుతం మనవ జీవన విధనంలో కాఫీ, టీ అనేది ఎక్కువగ తీసుకుంటుంటాం. అయితే స్త్రీలు కాఫీ,టీ ఎక్కువగా తాగడం వల్ల జననేంద్రియాలకు హాని కలిగిస్తుంది. కాఫీ,టీలో ఉండే కెఫిన్ శరీరంలోని, యోనిలో ఉండే పీహెచ్ స్థాయిల పై ప్రభావం చూపిస్తుందని.. దీంతో టీ,కాఫీ ఎక్కువ తాగడం వల్ల డయేరియా, డీహైడ్రేషన్ సమస్య వస్తుందని, ఇది యోని లోపలి పొరను పూర్తిగా దెబ్బతీసి.. యూరిన్ ఆమ్లంగా చేస్తుందని పరిశోధకులు చెబుతున్నారు. అయితే చాలా మంది స్త్రీలు చర్మ సౌదర్యం కోసం, ఆరోగ్యనికి మేలు చేస్తుందని సుగంధ ద్రవ్యాలతో తయారు చేయబడిన హెర్బల్ టీని ఎక్కువగా తీసుకుంటారు.
ఈ టీ కూడా స్త్రీల యోని ఆరోగ్యం పై ప్రభవం చూపిస్తుందని వైద్యులు చెబుతున్నారు. శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుందని, శరీర బరువు తగ్గుతుందని చాలా మంది పసుపు నీళ్లను, పసుపు టీని తాగుతారు. దీన్ని అతిగా తీసుకోవడం వల్ల శరీరంలో ఐరన్ లోపం ఏర్పడి రక్తహీనత ఏర్పడుతుంది. పసుపు స్త్రీ పునరుత్పత్తి పై ప్రభవం చూపిస్తుంది. మార్కెట్‌లో దొరికే కూల్ డ్రీంక్స్, సోడాలు వంటికి తాగడం వల్ల జీవక్రియ పై ప్రభావం చూపిస్తాయి. దీంతో పేగు, జననేంద్రియ ఇన్ఫెక్షన్లకు దారి తీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
.