నేడే హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఎన్నికలు

-

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్ సీ ఏ) ఎన్నికలు నేడు నిర్వహించనున్నారు. ఈ ఎన్నికలు అసెంబ్లీ ఎన్నికలను తలపిస్తుండడం విశేషం. పోటాపోటీగా ప్రెస్ మీట్ లు, ఒకరిపై ఒకరు ఆరోపణల పర్వాలు చోటు చేసుకున్నాయి. దీంతో హెచ్ సీ ఏ ఎన్నికలకూ రాజకీయ రంగు పులుముకుంది. బీఆర్ఎస్ – బీజేపీ మద్దతుదారుల మధ్య పోటీ కొనసాగుతోంది. యునైటెడ్ మెంబర్స్ ఆఫ్ హెచ్సీఏ ప్యానెల్ పేరుతో జగన్మోహన్ రావు బరిలోకి దిగుతున్నారు. తమకు ప్రభుత్వ మద్దతు ఉందని ఆయన తెలిపారు. ఇక, హెచ్సీఏ ఉపాధ్యక్షుడుగా శ్రీధర్, సెక్రెటరీగా హరినారాయణరావు, ట్రెజరర్ శ్రీనివాస్ రావు, జాయింట్ సెక్రెటరీగా నోయెల్ డేవిడ్ , కౌన్సిలర్ గా వినోద్ అన్సార్, అహ్మద్ ఖాన్ పోటీలో దిగుతున్నారు. అయితే, గుడ్ గవర్నెన్స్ ప్యానల్ పేరుతో పోటీలోకి అనిల్ కుమార్ ప్యానల్ దిగుతోంది.

- Advertisement -

బీజేపీ నేతలు, హెచ్సీఏ మాజీ అధ్యక్షుడు వివేక్ వెంకటస్వామి, వినోద్ వెంకటస్వామి మద్దతుతో అనిల్ కుమార్ అధ్యక్షునిగా పోటీ చేస్తున్నారు. హెచ్సీఏ ఉపాధ్యక్షుడుగా బర్జీత్ సింగ్, సెక్రటరీగా ఆగం రావు, ట్రెజరర్ గా మహేంద్ర, జాయింట్ సెక్రటరీగా బసవరాజు, కౌన్సిలర్ గా వినోద్ ఇంగ్లే బరిలో ఉన్నారు. మరో వైపు, క్రికెట్ ఫస్ట్ ప్యానెల్ పేరుతో హెచ్సీఏ ఎన్నికల బరిలోకి శివలాల్ యాదవ్, అర్షద్ ఆయూబ్ ప్యానల్ అధ్యక్షునిగా అమర్నాథ్ పోటీ చేస్తున్నారు. వైస్ ప్రెసిడెంట్ గా జీ.శ్రీనివాస్, ట్రెజరర్ గా సంజీవి రెడ్డి, జాయింట్ సెక్రటరీగా చిట్టి శ్రీధర్, కౌన్సిలర్ గా సునీల్ అగర్వాల్ ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

హిందూ సమాజానికి చంద్రబాబు క్షమాపణలు చెప్పాలి.. భూమన డిమాండ్

హిందు పరమ పవిత్రంగా భావించిన తిరుమల ప్రసాదాన్ని అడ్డుపెట్టుకుని రాజకీయం చేద్దామనుకున్న...

తిరుమల లడ్డూ ప్రసాద నెయ్యిపై ఇచ్చిన నివేదిక అప్పుడే తప్పవుతుంది: NDDB

NDDB Report | తిరుమల తిరుపతి శ్రీవారి లడ్డూ ప్రసాద తయారీలో...