విజయసాయిరెడ్డికి పంచ్ లు వేస్తున్న టీడీపీ సోషల్ మీడియా

విజయసాయిరెడ్డికి పంచ్ లు వేస్తున్న టీడీపీ సోషల్ మీడియా

0
80

వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో విమర్శలు ఆరోపణలు చేయడం షరమాములే ,అయితే వైసీపీ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో కూడా పెద్ద ఎత్తున విమర్శలు ఆరోపణలు చేసేవారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి, ఇప్పుడు చంద్రబాబుపై ఒంటికాలిపై లేస్తున్నారు. నిత్య విమర్శల పారాయణం చేస్తున్నారు సాయిరెడ్డి ..రోజూ లోకేష్ చంద్రబాబు పై ట్వీట్ పెట్టనిదే ఆయనకి రోజు గడవడం లేదు అనేలా మారిపోయింది.. తాజాగా బాబుపై దారుణమైన కామెంట్ చేశారు ఎంపీ విజయసాయిరెడ్డి.

తుఫాన్ ఎక్కడ తీరం దాటేది నాకు ముందే తెలుసు. హైదరాబాద్ ను నిర్మించా, నా విజన్ 2020 డాక్యుమెంట్ ని అబ్దుల్ కలామ్ కాపీ కొట్టారు. సుడోలాజియా ఫెంటాస్టికా అనే మానసిక రుగ్మత వల్లే ఇలా అయిపోయారు పాపం అంటూ చంద్రబాబు ని ఏకిపడేశారు. అయితే తర్కానికందని కోతలు కోయడం దీని లక్షణం అంటూ సంచలన వ్యాఖ్యలు చేసారు.

దీనిపై తెలుగుదేశం నేతలు కూడా తీవ్రస్ధాయిలో కామెంట్లు చేస్తున్నారు .. విజయసాయిరెడ్డికి పిచ్చి ముదిరి చంద్రబాబు పై విమర్శలు చేస్తున్నారని అవినీతి అక్రమాల్లో జగన్ వన్ అయితే, సాయిరెడ్డి నంబర్ 2 అని కామెంట్లు పెడుతున్నారు.