ప్రపంచకప్‌ చరిత్రలో ఫాస్టెస్ట్ సెంచరీతో రికార్డు సృష్టించిన మ్యాక్స్‌వెల్..

-

భారత్ వేదికగా జరుగుతున్న 2023 వన్డే ప్రపంచకప్‌లో రికార్డుల మీద రికార్డులు నమోదవుతున్నాయి. తాజాగా ఢిల్లీలో జరిగిన ఆస్ట్రేలియా-నెదర్లాండ్స్ మ్యాచ్‌లో ఆసీసీ ఆట‌గాడు గ్లెన్ మాక్స్‌వెల్(Glenn Maxwell) చ‌రిత్ర సృష్టించాడు. 40 బంతుల్లోనే సెంచ‌రీ చేసి వన్డే ప్రపంచ‌క‌ప్ చ‌రిత్రలోనే అత్యంత వేగంగా శ‌త‌కం బాదిన ఆట‌గాడిగా రికార్డు నెలకొల్పాడు. ఈ క్రమంలో ద‌క్షిణాఫ్రికా ఆట‌గాడు మార్‌క్రమ్ రికార్డును బ‌ద్దలు కొట్టాడు.

- Advertisement -

వన్డే ప్రపంచ‌క‌ప్‌లో ఫాస్టెస్ట్ సెంచ‌రీ చేసిన ఆట‌గాళ్లు..

గ్లెన్ మాక్స్‌వెల్(ఆస్ట్రేలియా)- 40 బంతుల్లో (2023)

ఐడెన్ మార్‌క్రమ్(ద‌క్షిణాఫ్రికా)- 49 బంతుల్లో (2023)

కెవిన్ ఓబ్రియన్(ఐర్లాండ్ )- 50 బంతుల్లో (2011)

గ్లెన్ మాక్స్‌వెల్(ఆస్ట్రేలియా)- 51 బంతుల్లో (2015)

ఏబీ డివిలియర్స్(ద‌క్షిణాఫ్రికా)- 52 బంతుల్లో (2015)

ఓవరాల్‌గా వన్డేల్లో 31 బంతుల్లోనే సెంచ‌రీ చేసిన ఆటగాడిగా ద‌క్షిణాప్రికా దిగ్గజ ప్లేయర్ ఏబీ డివిలియ‌ర్స్ మొద‌టి స్థానంలో ఉన్నాడు. ఆ త‌ర్వాత స్థానాల్లో కోరె అండ‌ర్సన్(36 బంతుల్లో), షాహీద్ ఆఫ్రిదీ(37 బంతుల్లో) ఉన్నారు.

ఇక ఈ మ్యాచ్ విష‌యానికి వ‌స్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా జట్టు నిర్ణీత 50 ఓవ‌ర్లలో 8 వికెట్ల న‌ష్టానికి 399 ప‌రుగులు చేసింది. డేవిడ్ వార్నర్ (104; 93 బంతుల్లో 11 ఫోర్లు, 3 సిక్సర్లు) సెంచ‌రీ చేయగా.. మ్యాక్స్‌వెల్(Glenn Maxwell) (106, 44 బంతుల్లో 9 ఫోర్లు, 8 సిక్సర్లు) వీరవిహారం చేశాడు. వీరితో పాటు స్టీవ్ స్మిత్ (71), ల‌బుషేన్ (62)లు అర్థ సెంచ‌రీలతో రాణించారు. నెద‌ర్లాండ్స్ బౌల‌ర్లలో వాన్ బీక్ 4, బాస్ డి లీడే 2, ఆర్యన్ దత్ ఒక వికెట్ పడగొట్టారు.

Read Also: రాష్ట్రంలో ఎక్కడ చూసినా అరాచకమే.. చంద్రబాబును ఏం చేయలేరు: భువనేశ్వరి 
Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Dandruff | ఈ చిట్కాలతో వారం రోజుల్లో చుండ్రుకు చెక్..

చుండ్రు(Dandruff) ప్రస్తుతం అనేక మందిని సతాయిస్తున్న సమస్య. దీనికి ఎన్ని రకాల...

HYDRA | ఆ భవనాలను హైడ్రా కూల్చదు: రంగనాథ్

గ్రేటర్ పరిధిలో హైడ్రా(HYDRA) చేపడుతున్న కూల్చివేతలపై తాజాగా హైడ్రా కమిషనర్ రంగనాథ్...