టీమిండియా మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్(VVS Laxman) త్వరలోనే భారత పురుషుల క్రికెట్ జట్టుకు హెడ్ కోచ్‌గా వ్యవహరించనున్నారు. ప్రస్తుతం జరుగుతున్న వన్డే ప్రపంచకప్ ముగిసిన అనంతరం ఆస్ట్రేలియాతో భారత్ టీ20 సిరీస్ ఆడనుంది. నవంబరు 23 నుంచి జరగనున్న ఈ సిరీస్‌కు లక్ష్మణ్ తాత్కాలిక కోచ్‌గా వ్యవహరించే అవకాశం ఉందనే వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం కోచ్‌గా వ్యవహరిస్తున్న రాహుల్ ద్రవిడ్ ఒప్పందం ప్రపంచకప్‌తో ముగియనుంది. దీంతో ద్రవిడ్ స్థానంలో తాత్కాలికంగా లక్ష్మణ్‌ను నియమించున్నారని తెలుస్తోంది..
హెడ్ కోచ్ పదవి కోసం బీసీసీఐ ఆశావహుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించనుంది. వచ్చిన దరఖాస్తులను పరిశీలించి కోచ్‌ను నియమించనుంది. ఈ ప్రక్రియకు కొంత సమయం పట్టే అవకాశం ఉంది. అందుకే ఈ లోపు జరిగే ఆసీస్ సిరీస్‌కు లక్ష్మణ్‌ను తాత్కాలికంగా కోచ్‌గా నియమించాలని బీసీసీఐ భావిస్తోందని సమాచారం.