పెళ్లి అయిన 10 నిమిషాలకే విడాకులు ఇచ్చిన భార్య రీజన్ వింటే షాక్

పెళ్లి అయిన 10 నిమిషాలకే విడాకులు ఇచ్చిన భార్య రీజన్ వింటే షాక్

0
98

ఉత్తరప్రదేశ్ లోని లఖింపూర్ ఖేర్ లోని మైలానీ ప్రాంతంలో ఓ జంటకు వివాహం జరిగింది. ఫంక్షన్ హాల్ లో రిసెప్షన్ వేళ పెళ్లి జోష్ కనిపిస్తోంది. అయితే పెళ్లి కొడుకుతో సరదాగా అతని ఫ్రెండ్స్ డ్యాన్స్ చేయమని బలవంతం చేశారు. దీనికి ముందు అతను ఒప్పుకోలేదు. కాని తర్వాత అతని ప్రెండ్స్ బలవంతం చేయడంతో స్టేజ్ పై నుంచి దిగి డ్యాన్స్ మొదలు పెట్టాడు.

సూపర్ గా పెళ్లి కొడుకు డ్యాన్స్ చేయడంతో అందరూ అతనిని చూశారు. ఈ సమయంలో పెళ్లి కూతురు కూడా భర్త డ్యాన్స్ ఎంజాయ్ చేయాల్సింది పోయి ఆమె అతనిపై కస్సుబుస్సుమంది, ఇక డ్యాన్స్ చేసి పైకి వచ్చి దండలు మార్చుకున్నాడు, ఈ సమయంలో మళ్లీ ఫ్రెండ్స్ పిలవడంతో రెండోసారి నాగిని డ్యాన్స్ చేశాడు… కాస్త జోష్ పెంచేందుకు స్నేహితుడు ఇచ్చిన బీరుని గడగడ తాగేశాడు, ఇక పెళ్లి కూతురికి చిరాకు వచ్చింది.. పెళ్లి మండపంలోనే అతను వేసిన దండలు తీసేసి తాళి పక్కన పడేసి కిందకి వచ్చేసింది, అతను పచ్చి తాగుబోతులా ఉన్నాడు నేను పెళ్లి చేసుకోను అని విడాకులు ఇచ్చింది.