ప్రభాస్ కు బాలీవుడ్ నుంచి కొత్త ఆఫర్

ప్రభాస్ కు బాలీవుడ్ నుంచి కొత్త ఆఫర్

0
86

ప్ర‌భాస్ ప్ర‌స్తుతం జాన్ అనే టైటిల్ మూవీ చిత్రంలో బిజీ బిజీగా ఉన్నారు ..అయితే ప్రభాస్ కు ఇప్పుడు బాలీవుడ్ లో కూడా క్రేజ్ అమాంతం పెరిగింది అనేది తెలిసిందే.. అయితే తాజాగా బాలీవుడ్ లోప్రభాస్ కు బాగా తెలిసిన ఓ నిర్మాత మరో పెద్ద కార్పొరేట్ టైకూన్ తో కలిసి కొత్తగా సినిమా చేయాలని అనుకుంటున్నారట.. అది ఫుల్ యాక్షన్ ఓరియెంటెడ్ చిత్రం అని తెలుస్తోంది. అయితే అందులో ప్రభాస్ ని హీరోగా తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నారట.

బాలీవుడ్ లో ప్రభాస్ తో నేరుగా సినిమా చేయాలని వారు భావిస్తున్నారట.. అంతేకాదు ఇందులో మొత్తం బాలీవుడ్ నటులు నటించనున్నారు.. ముందు ప్రభాస్ తో ఈ స్టోరీ గురించి డిస్కస్ చేసి దీని గురించి అనౌన్స్ చేయనుందనేది బీటౌన్ న్యూస్, అయితే బాలీవుడ్ లో బాహుబలి సినిమాతో సదరు నిర్మాత భారీగా వెనకేసుకున్నారు.. తాజాగా మరోసారి ప్రభాస్ తో బాలీవుడ్ లో నేరుగా చిత్రం చేసి ఇండియాలో విడుదల చేయాలని చూస్తున్నారు. మరి ప్రభాస్ ఏం చెబుతారో చూడాలి