తెలంగాణ డీజీపీ అంజనీ కుమార్(DGP Anjani Kumar) పై సెంట్రల్ ఈసీ సస్పెన్షన్ వేటు వేసింది. కాంగ్రెస్ మెజారిటీ మార్క్ దాటగానే రేవంత్ రెడ్డి(Revanth Reddy)తో డీజీపీ భేటీ అయ్యారు. ఆయనతో పాటు మరో ఇద్దరు పోలీసు అధికారులు మహేష్ భగవత్, సంజయ్ కుమార్ జైన్ లు రేవంత్ రెడ్డిని కలిసి అభినందనలు తెలిపారు. ఇది ఎన్నికల కోడ్ ని ఉల్లంఘించడమే అని భావించిన ఈసీ అంజనీ కుమార్ పై సస్పెన్షన్ వేటు వేసింది. ఈ వ్యవహారంపై నివేదిక ఇవ్వాలంటూ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.ఈ మేరకు మహేష్ భగవత్(Mahesh Bhagwat), సంజయ్ కుమార్ జైన్(Sanjay Kumar Jain) లకి షోకాజ్ నోటీసులు ఇచ్చింది.
DGP Anjani Kumar | తెలంగాణ డీజీపీ అంజనీ కుమార్ కి ఈసీ బిగ్ షాక్
-