Cyclone Michaung | తుఫాన్ ప్రభావిత ప్రాంతాల కలెక్టర్లతో సీఎం జగన్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా వరద బాధితులకు సహాయక చర్యలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు.
అధికారులకు సీఎం ఏం ఆదేశాలు ఇచ్చారంటే…
అధికారులంతా మీమీ ప్రాంతాల్లో సాధారణ పరిస్థితులను తీసుకురావడంపై దృష్టిపెట్టాలి బాధితులపట్ల సానుభూతితో వ్యవహరించండి
బాధితుల స్థానంలో మనం ఉంటే.. ఎలాంటి సహాయాన్ని ఆశిస్తామో.. ఆ తరహా సహాయం వారికి అందించాలి
రూ.10లు ఎక్కువైనా పర్వాలేదు, వారికి మంచి సహాయం అందాలి
ఇంత కష్టంలో కూడా బాగా చూసుకున్నారనే మాట రావాలి
పరిహారం అందించడం పట్ల సానుభూతితో ఉండండి
దెబ్బతిన్న ఇళ్ల విషయంలో కానీ, క్యాంపులనుంచి ప్రజలను తిరిగి వెళ్తున్న సందర్బంలోకాని వారికి ఇవ్వాల్సిన సహాయం వారికి ఇవ్వాలి
రేషన్ పంపిణీలో కూడా ఎలాంటి లోపం ఉండకూడదు
పంట పొలాల్లో ఉన్న వరదనీటిని పూర్తిగా తొలగించడంపై దృష్టిపెట్టాలి
పంటల రక్షణ, తడిసిన ధాన్యాన్ని, రంగు మారిన ధాన్యాన్ని కొనుగోలు చేయడం దగ్గర నుంచి అన్నిరకాలుగా తోడుగా ఉండాలి
యుద్ధప్రాతిపదికన విద్యుత్‌ను పునరుద్ధరించాలి
రోడ్లు దెబ్బతిన్న ప్రాంతాల్లో రవాణా పునరుద్ధరణకు వెంటనే చర్యలు తీసుకోండి
వర్షాలు తగ్గుముఖంపట్టిన ప్రాంతాల్లో వ్యాధులు ప్రబలకుండా పారిశుద్ధ్యంపై దృష్టిపెట్టండి
చెట్టుకూలి చనిపోయిన కానిస్టేబుల్ కుటుంబాన్ని కూడా ప్రభుత్వం ఆదుకుంటుంది
ఆ కుటుంబానికి రూ.30 లక్షల సహాయాన్ని అందిస్తాం
విధినిర్వహణలో ఉన్న ఉద్యోగుల స్థైర్యం నిలబడేలా ప్రభుత్వం తోడుగా నిలుస్తుంది
బాధితుల్లో ఆత్మస్థైర్యాన్ని నిలబెట్టేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది