ఎన్నికలకు ముందు ఏపీ రాజకీయాల్లో సంచలన పరిణామం చోటుచేసుకుంది. మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి(Alla Ramakrishna Reddy) పార్టీతో పాటు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనమా లేఖను శాసనసభా కార్యదర్శికి స్వయంగా అందజేశారు. వ్యక్తిగత కారణాలతోనే రాజీనామా చేస్తున్నానని లేఖలో పేర్కొన్నారు. అలాగే పార్టీ పదవికి కూడా రాజీనామా చేస్తూ మరో లేఖను అధ్యక్షుడు జగన్‌కు పంపించారు. దీంతో వైసీపీలో ఒక్కసారిగా కలవరం రేగింది.
కొంత కాలంగా వైసీపీ(YCP) కార్యక్రమాలకు, రాజకీయాలకు ఆర్కే దూరంగా ఉంటున్నారు. మరోవైపు మంగళగిరి(Mangalagiri) నియోజకవర్గంలో వైసీపీ నేతల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఇటీవల పోటాపోటీగా కార్యాలయాలు సైతం నిర్వహిస్తున్నారు. టీడీపీ నుంచి వైసీపీలో చేరిన గంజి చిరంజీవి(Ganji Chiranjeevi) వర్గానికి, ఆళ్ల(Alla Ramakrishna Reddy) వర్గానికి విభేదాలు తారాస్థాయికి చేరాయి. ఈ క్రమంలో చిరంజీవి వేరుగా పార్టీ కార్యాలయాన్ని కూడా ఏర్పాటుచేశారు. దీంతో మనస్తాపం చెందిన ఆళ్ల పార్టీని వీడినట్లు చర్చ జరుగుతోంది.