తెలంగాణ మాజీ డీజీపీ అంజనీకుమార్(Anjani Kumar)కు బిగ్ రిలీఫ్ లభించింది. ఆయనసై విధించిన సస్పెన్షన్ను కేంద్ర ఎన్నికల సంఘం ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 3న ఎన్నికల ఫలితాలు వెల్లడి రోజు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని కలవడంతో ఈసీ సస్పెండ్ చేసింది. ఉద్దేశపూర్వకంగా ఎన్నికల కోడ్ ఉల్లఘించలేదని.. రేవంత్ పిలవడంతోనే వెళ్లి కలిశానని ఈసీకి తెలిపారు. మరోసారి ఇలా జరగదని చెప్పడంతో ఎన్నికల సంఘం ఆయనపై సస్పెన్షన్ ఎత్తివేస్తూ ప్రభుత్వానికి సమాచారం అందించింది.
కాగా ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ జరుగుతుండగానే డీజీపీ హోదాలో రేవంత్ రెడ్డి(Revanth Reddy)ని కలవడంపై ఈసీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఎన్నికల కోడ్ నిబంధనల ప్రకారం ఫలితాలు పూర్తిగా వెల్లడి కాకుండానే రాజకీయ నేతలను కలవడం నిషేధమని చెబుతూ సస్పెండ్ చేసింది. దీంతో ఆయన స్థానంలో సీనియర్ ఐపీఎస్ అధికారి రవి గుప్తాను తాత్కాలిక డీజీపీగా నియమిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు సస్పెన్షన్ ఎత్తివేయడంతో అంజనీకుమార్(Anjani Kumar)ను మళ్లీ డీజీపీగా నియమిస్తారా..? లేక మరో పోస్టింగ్ ఇస్తారా..? అనేది తేలనుంది.
Read Also: మధ్యప్రదేశ్ సీఎం ని ప్రకటించిన బీజేపీ
Follow us on: Google News, Koo, Twitter, ShareChat