తనపై వచ్చిన భూకబ్జా ఆరోపణలపై మాజీ మంత్రి మల్లారెడ్డి(Malla Reddy) స్పందించారు. భూకబ్జాతో తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టంచేశారు. తనపై పోలీస్ కేసు నమోదైన విషయం వాస్తవమేనని తెలిపారు. దీనిపై కోర్టును ఆశ్రయిస్తానని పేర్కొన్నారు. గిరిజనుల 47 ఎకరాలకు సంబంధించిన భూమి విషయంలో కొంతమంది మధ్యవర్తులు కొనుగోలు, అమ్మకాల్లో ఉన్నారన్నారు. వారే భూమిని కబ్జా(Land Grab) చేసి ఉంటారని ఆయన ఆరోపించారు. అయితే దీనిని ప్రభుత్వ కక్షసాధింపుగా పరిగణించడం లేదని ఆయన చెప్పుకొచ్చారు.
కాగా సికింద్రాబాద్ శివారులోని మూడుచింతలపల్లి(Muduchintalapalli) మండలం కేశవరం గ్రామంలోని గిరిజనుల భూమిని ఆయన అక్రమంగా సొంతం చేసుకున్నారని శామీర్ పేట పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైన సంగతి తెలిసిందే. గిరిజనులను చెందిన 47 ఎకరాలను మల్లారెడ్డి(Malla Reddy)తో పాటు ఆయన అనుచరులు కబ్జా చేశారని భిక్షపతి అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదుచేశారు. దీంతో ఆయనపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుతో పాటు 420 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.