Governor Tamilisai | ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ తమిళిసై ప్రసంగం

-

తెలంగాణలో కొత్త ప్రభుత్వానికి గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్(Governor Tamilisai) అభినందనలు తెలిపారు. అసెంబ్లీలో ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్‌ ప్రసంగించారు. ప్రజాకవి కాళోజీ కవితతో తన ప్రసంగం ప్రారంభించిన గవర్నర్.. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలకు శుభాకాంక్షలు తెలియజేశారు. అణచివేత, అప్రజాస్వామిక పోకడలను తెలంగాణ ప్రజలు సహించరని.. కొత్త ప్రభుత్వం ప్రజా ప్రభుత్వమని పేర్కొన్నారు.

- Advertisement -

గవర్నర్(Governor Tamilisai) ప్రసంగంలోని ముఖ్యాంశాలు..

స్వరాష్ట్రం కోసం ప్రాణత్యాగం చేసిన వారికి సభావేదికగా నివాళి అర్పిస్తున్నాం.

ప్రజల ఫిర్యాదులు స్వీకరించేందుకు ప్రజావాణి చేపట్టాం. ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చే దిశగా కృషి చేస్తాం.

4 కోట్ల ప్రజల ఆకాంక్షలతో ఏర్పడిన రాష్ట్రం ఇది. మా పాలన దేశానికే ఆదర్శం కాబోతోంది.

అమరవీరుల ఆకాంక్షలను పరిగణనలోకి తీసుకుని పాలన సాగిస్తాం.

ప్రజాసంక్షేమం కోసమే ఆరు గ్యారంటీలు ప్రకటించాం.

తొలి అడుగులోనే సంక్షేమానికి మా ప్రభుత్వం నాంది పలికింది.

బాధ్యతలు స్వీకరించిన రెండు రోజుల్లోనే రెండు గ్యారంటీలు అమలు చేశాం.

వచ్చే వంద రోజుల్లో ఆరు గ్యారంటీల అమలుకు కార్యాచరణ రూపొందిస్తాం.

పెరిగిన వైద్య ఖర్చుల నిమిత్తం ఆరోగ్యశ్రీ పరిధిని రూ.10 లక్షలకు పెంచాం.

అమరవీరుల కుటుంబాలకు 250 గజాల ఇంటిస్థలం.. గౌరవభృతి ఇస్తాం.

వ్యవసాయానికి 24 గంటల విద్యుత్‌ ఇచ్చేందుకు మా ప్రభుత్వం కట్టుబడి ఉంది.

ప్రతి పంటకు మద్దతు ధర ఇస్తాం. రూ 2 లక్షల రుణమాఫీపై త్వరలోనే కార్యాచరణ.

అసైన్డ్‌, పోడు భూములకు త్వరలోనే పట్టాల పంపిణీ కాళేశ్వరం, మేడిగడ్డ, అన్నారం బ్యారేజీల్లో అవినీతిపై విచారణ జరిపిస్తాం.

వచ్చే ఆరు నెలల్లో మెగా డీఎస్సీ నిర్వహించి ఉద్యోగాలు భర్తీ చేస్తాం.

టీఎస్పీఎస్సీ ప్రక్షాళనకు ఇప్పటికే కార్యచరణ ప్రారంభించాం.

మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి హామీకి కట్టుబడి ఉన్నాం.

Read Also: ఆసుపత్రి నుంచి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ డిశ్చార్జ్
Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Dandruff | ఈ చిట్కాలతో వారం రోజుల్లో చుండ్రుకు చెక్..

చుండ్రు(Dandruff) ప్రస్తుతం అనేక మందిని సతాయిస్తున్న సమస్య. దీనికి ఎన్ని రకాల...

HYDRA | ఆ భవనాలను హైడ్రా కూల్చదు: రంగనాథ్

గ్రేటర్ పరిధిలో హైడ్రా(HYDRA) చేపడుతున్న కూల్చివేతలపై తాజాగా హైడ్రా కమిషనర్ రంగనాథ్...