సిద్ధిపేట(Siddipet) జిల్లాలో దారుణం జరిగింది. కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ వద్ద గన్‌మెన్‌గా పని చేస్తున్న ఆకుల నరేష్ భార్య, ఇద్దరు పిల్లలను చంపి తానూ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. చిన్నకోడూర్‌లోని రామునిపట్లలో నరేశ్ కుటుంబంతో కలిసి ఉంటున్నారు. తన వద్ద ఉన్న 9 ఎంఎం పిస్టల్‌తో ముందుగా భార్య చైతన్య, కుమారుడు రేవంత్, కుమార్తె హిమశ్రీను కాల్చేశాడు. అనంతరం తానూ కాల్చుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు.
Siddipet | అయితే ఇవాళ విధులకు రాకపోవడంతో సిబ్బంది ఇంటికి వెళ్లి చూడగా నలుగురు రక్తపు మడుగులో పడి ఉన్నారు. దీంతో పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు. వీరి ఆత్మహత్యకు ఆర్థిక ఇబ్బందులే కారణమా? లేక కుటుంబ కలహాలు కారణమా? మరేదైనా కారణాలు ఉన్నాయా.? అని ఆరా తీస్తున్నారు.