Revanth Reddy | ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం

-

ట్రాఫిక్ ఇబ్బందులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) కీలక నిర్ణయం తీసుకున్నారు. తనకోసం ట్రాఫిక్ ఆపవద్దంటూ పోలీసు ఉన్నతాధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. సాధారణ ట్రాఫిక్ లోనే తన కాన్వాయ్ ని తీసుకెళ్లేలా చర్యలు తీసుకోవాలని కోరారు. కాన్వాయ్ వెళ్తున్న సమయంలో సామాన్య ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.

- Advertisement -

అలాగే, సీఎం కాన్వాయ్(Convoy) లోని 15 వాహనాలను 9 వాహనాలకు తగ్గించామని, తాను ప్రయాణించే మార్గంలో కూడా ట్రాఫిక్ జామ్ లు లేకుండా, ట్రాఫిక్ ను నిలిపివేయకుండా ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలని పోలీస్ అధికారులకు సూచించారు. ప్రజల సమస్యలను స్వయంగా తెలుసుకోవడానికి తాను విస్తృత స్థాయిలో పర్యటనలను చేయాల్సి ఉంటుందన్నారు. ఈ నేపథ్యంలో తాను ప్రయాణించే మార్గంలో ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా ఏవిధమైన చర్యలు తీసుకోవాలో సూచించాలని పోలీస్ అధికారులను సీఎం(CM Revanth Reddy) కోరారు. ప్రజల సమస్యలను పట్టించుకోకుండా, ఇంట్లో కూర్చోవడం తనకు సాధ్యం కాదన్నారు.

Read Also: భార్య పిల్లలను చంపి సిద్ధిపేట జిల్లా కలెక్టర్ గన్‌మెన్ ఆత్మహత్య
Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Sesame Seeds | చలికాలంలో తెల్ల నువ్వులు ఎంత మ్యాజిక్ చేస్తాయో తెలుసా..

Sesame Seeds | చలికాలంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా పెద్ద టాస్క్...

Jagapathi Babu | రేవతి కుటుంబాన్ని నేను పరామర్శించా: జగపతిబాబు

Jagapathi Babu | సంధ్య థియేటర్ ఘటన రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా...