IPL Auction 2024 | ఆస్ట్రేలియాకు వరల్డ్‌కప్ అందించిన ఆ జట్టు కెప్టెన్ ప్యాట్ కమిన్స్(Pat Cummins) ఐపీఎల్ వేలంలో చరిత్ర సృష్టించాడు. దుబాయ్ వేదికగా జరుగుతున్న మినీ వేలంలో ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ధర పలికాడు. వేలం పాటలో కమిన్స్‌ను దక్కించుకునేందుకు సన్ రైజర్స్ హైదరాబాద్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంచైజీలు హోరాహోరీగా పోటీపడ్డాయి. చివరకు రూ. 20.50 కోట్ల రికార్డు ధరతో ఆసీస్ సారథిని సన్ రైజర్స్ దక్కించుకుంది. దీంతో గతంలో రూ.18.50కోట్లు పలికిన సామ్ కరన్ రికార్డును కమిన్స్ అధిగమించాడు.
ఇక ఇంగ్లండ్ ఆల్ రౌండర్ క్రిస్ వోక్స్‌ను రూ.4.20 కోట్లకు పంజాబ్ కింగ్స్ దక్కించుకుంది. రూ.2 కోట్ల కనీస ధరతో వేలంలోకి వచ్చిన గెరాల్డ్ కోయెట్జీను రూ.5 కోట్లకు ముంబై ఇండియన్స్ కొనుగోలు చేసింది. రూ.2 కోట్ల కనీస ధరతో వేలంలోకి వచ్చిన హర్షల్ పటేల్‌ను రూ.11.75 కోట్లకు పంజాబ్ కింగ్స్ చేజిక్కించుకుంది. రూ.50 లక్షల బేస్ ధరతో వేలం బరిలోకి దిగిన న్యూజిలాండ్ యువ ఆల్ రౌండర్ రచిన్ రవీంద్రను రూ.1.80 కోట్లకు చెన్నైసూపర్ కింగ్స్ కొనుగోలు చేసింది.
IPL Auction 2024 | రూ.2 కోట్ల బేస్ ప్రైజ్‌తో వేలం బరిలోకి దిగిన టీమిండియా స్టార్ పేసర్ శార్దూల్ ఠాకూర్‌ను కూడా రూ.4 కోట్లకు సీఎస్కే సొంతం చేసుకుంది. శ్రీలంక ఆల్ రౌండర్ వసింద్ హసరంగను రూ.1.50 కోట్ల బేస్ ప్రైజ్ ధరకు, ఆస్ట్రేలియా ఓపెనర్ ట్రావిస్ హెడ్‌ను రూ.6.7కోట్లకు హైదరాబాద్ దక్కించుకుంది. ఇదిలా ఉంటే ఆసీస్ స్టార్ బ్యాటర్ స్టీవ్ స్మిత్, దక్షిణాఫ్రికా ప్లేయర్ రిలీ రొసోవ్, భారత ప్లేయర్లు మనీశ్ పాండే, కరుణ్ నాయర్ అన్‌సోల్డ్‌గా మిగిలారు.