వాలంటీటర్లకు ఏపీ ప్రభుత్వం శుభవార్త అందించింది. సీఎం జగన్(CM Jagan) పుట్టినరోజ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా గ్రామ, వార్డు వాలంటీర్లకు జీతం(Volunteer Salary) పెంచుతున్నట్లు ప్రకటించింది. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి కారుమూరి నాగేశ్వరరావు(Karumuri Nageswara Rao) మీడియాతో మాట్లాడుతూ జనవరి 1వ తేదీ నుంచి వాలంటీర్స్ జీతం(Volunteer Salary) అదనంగా రూ.750 రూపాయలు పెంచుతున్నామని ప్రకటించారు. తమ అధినేత జన్మదినం కానుకగా వాలంటీర్లు సమర్ధవంతంగా పనిచేయాలనే ఉద్దేశంతో నెలకు రూ.750 పెంచుతున్నట్లు ఆయన తెలిపారు. రాబోయే రోజుల్లో వాలంటీర్లకు మంచి భవిష్యత్తు ఉంటుందని మంత్రి స్పష్టం చేశారు.
టీడీపీ అధినేత చంద్రబాబు(Chandrababu), జనసేన చీఫ్ పవన్ కల్యాణ్(Pawan Kalyan) కలిసి రాష్ట్రాన్ని దోచుకునేందుకు చూస్తున్నారని మండిపడ్డారు. జగన్ పాలనలో రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకుపోతుండగా అడ్డుపడుతున్నారని ఆరోపించారు. వారు ఎన్ని కుట్రలు చేసినా జగన్ మరోసారి ముఖ్యమంత్రి కావడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు.