అభ్యర్థులు ఎంపికపై జనసేన కీలక స్టెప్స్ వేస్తోంది. నియోజకవర్గాల వారీగా పార్టీ అధినేత పవన్ కళ్యాణ్(Pawan Kalyan) సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే 15 నుండి 20 నియోజకవర్గాల రివ్యూలు పూర్తి చేశారు. ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికన సమీక్షలు జరుపుతున్నారు. వైజాగ్, విజయనగరం, తూర్పుగోదావరి జిల్లా, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, చిత్తూరు జిల్లాలోని పలు నియోజకవర్గాలపై రివ్యూ నిర్వహించారు. నేడు మరికొన్ని నియోజకవర్గాలపై సమీక్ష జరుపుతున్నారు. పోటీ చేసేందుకు అవకాశం ఉన్న నియోజకవర్గాలపైనే పవన్ కళ్యాణ్ కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తోంది.
నెల్లిమర్ల, భీమిలి, పెందుర్తి, యలమంచిలి, కాకినాడ రూరల్, కాకినాడ అర్బన్, రాజానగరం, రాజోలు, అమలాపురం, అవనిగడ్డ, పెడన, బందరు, గుంటూరు వెస్ట్, నరసరావుపేట, చీరాల, గిద్దలూరు, తిరుపతి సెగ్మెంట్లపై జనసేన(Janasena) రివ్యూ చేసింది. ఇవాళ మరికొన్ని నియోజకవర్గాలపై సమీక్ష చేయనున్నారు. దీంతో జనసేన నుండి టికెట్ ఆశిస్తున్నవారిలో ఉత్కంఠ మొదలైంది. బెర్త్ కన్ఫర్మ్ అవుతుందో లేదో అని కంగారు పడుతున్నారు ఆశావహులు. మరి జనసేనాని(Pawan Kalyan) ఎవరికి వరం ఇస్తారో తెలియాలంటే వేచి చూడాల్సిందే.