Medigadda Barrage | కాళేశ్వరం ప్రాజెక్టు పరిశీలన.. ఈఎన్సీ పై మంత్రుల బృందం ఆగ్రహం

-

కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) శుక్రవారం ఐదుగురు మంత్రుల బృందం పరిశీలించారు. ఉత్తంకుమార్ రెడ్డి(Uttam Kumar Reddy), కోమటిరెడ్డి వెంకటరెడ్డి, శ్రీధర్ బాబు(Sridhar Babu), పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మధ్యాహ్నము ఒంటిగంట వరకు భారీ వద్దకు చేరుకున్నారు. మంత్రులతో పాటు ఎమ్మెల్యే వివేక్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కూడా ఉన్నారు. అందరూ కలిసి ప్రాజెక్టు నిర్మాణాన్ని, పనితీరును పరిశీలించారు. కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) పై నీటిపారుదల శాఖ అధికారులు మంత్రులకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. అనంతరం మంత్రులు మీడియాతో మాట్లాడారు.

- Advertisement -

కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభించినప్పటికీ మాకు అనుమానాలు ఉన్నాయని, ప్రాజెక్టు గురించి మొదటి నుంచి మేము చెబుతున్న విషయాలు నిజమయ్యాయని అన్నారు. మేడిగడ్డ( Medigadda Barrage) కుంగినప్పట్నుంచి కెసిఆర్(KCR) స్పందించలేదని, దీనిపై న్యాయ విచారణ చేపడతామని శాసనసభలో ప్రకటించిన విషయాన్ని గుర్తు చేశారు. ప్రాజెక్టులను ఇంజినీర్ల సలహాలు తీసుకొని కట్టారా? లేక కేసీఆరే స్వయంగా చీఫ్ ఇంజినీర్‌గా డిజైన్ చేశారా? ఇంజినీర్లు సలహాలు ఇవ్వాలి.. వినకపోతే సెలవు పెట్టి పోవాలి అంటూ ఇంజినీర్ ఇన్ చీఫ్ పై ఫైర్ అయ్యారు. తాము లేవనెత్తిన ప్రశ్నలకు ఈఎన్సీ లిఖిత పూర్వకంగా సమాధానాలు ఇవ్వాలని ఆదేశించారు. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు నిర్మాణం చేపడతామని ఈ సందర్భంగా మంత్రులు తెలిపారు.

Read Also: లీక్ అవుతున్న పెట్రోల్ కోసం వెళ్లి 40 మంది దుర్మరణం
Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Ramamurthy Naidu | ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఇంట తీవ్ర విషాదం

తమ్ముడు నారా రోహిత్(Nara Rohit) తండ్రి నారా రామ్మూర్తి నాయుడు(Ramamurthy Naidu)...

Glowing Skin | చలికాలంలో మెరిసిపోయే చర్మం కోసం టిప్స్

Glowing Skin | చలికాలంలో డ్రై స్కిన్ వేధిస్తుంటుంది. దీనికి తోడు...