Cold Home Remedies | వింటర్ సీజన్ లో కొన్ని రకాల ఆరోగ్య సమస్యలు తరచూ వేధిస్తూ ఉంటాయి. వణికించే చలి ఓవైపు, శ్వాస సంబంధ సమస్యలు మరోవైపు ఇబ్బంది పెడుతుంటాయి. తరచూ జలుబు చేయడం, దగ్గు(Cough), తుమ్ములు(Sneezes) వంటివి వెంటాడుతూ ఉంటాయి. అయితే ఈ సమస్యలను అశ్రద్ధ చేయకుండా త్వరగా తగ్గిపోయేందుకు చర్యలు తీసుకోవాలి. లేదంటే ఈ జలుబు చాలా సందర్భాల్లో బ్రాంకైటిస్ కి దారి తీసే ప్రమాదం ఉంది. మరి శీతాకాలంలో శ్వాస సంబంధ సమస్యల నుండి ఉపశమనం పొందడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
Cold Home Remedies :
చలికాలంలో పావు టీ స్పూన్ మిరియాల(Black Pepper) పొడిని తేనె(Honey)లో కలిపి తరచూ తీసుకోవాలి.
వేడి నీటిలో పసుపు కలిపి ఆవిరి పట్టడం వల్ల జలుబు నుంచి ఉపశమనం కలుగుతుంది.
వేడి నీటిలో అల్లం(Ginger) తురుము వేసుకుని మరగనివ్వాలి. తర్వాత ఆ నీటిని వడకట్టి బెల్లం గానీ పటిక బెల్లం(Jaggery) గానీ లేదంటే చక్కెర కలుపుకుని వేడిగా తాగాలి.
తేనెలో అల్లం రసం కలిపి తరచూ చప్పరిస్తూ ఉండటం వలన కూడా జలుబు బాధల నుంచి ఉశమనం ఉంటుంది.