తెలుగు చిత్రపరిశ్రమకు చెందిన స్టార్ హీరో, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీగా ఉన్నారు… ఇక నుంచి తాను ప్రజా సేవకు అంకితం అవుతానని పవన్ పలు బహిరంగ సభల్లో చెప్పిన సంగతి తెలిసిందే…
ప్రస్తుతం ఆయన కుమారుడు అకీరా నందర్ చదువుకుంటున్నాడు పవన్ రాజకీయాల్లో ఉంటే ఆయన కుమారుడు భవిష్యత్ ఎలా ఉండబోతుందని పెద్ద ప్రశ్న… తాజా విస్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం అకీరా బాధ్యతలను కొనిదెల ప్రొడక్షన్ అధినేత రామ్ చరణ్ తీసుకున్నారట…
ప్రస్తుతం అకీరా చదువుకుంటున్నాడు స్టడీ పూర్తి అయిన తర్వాత తన కెరియర్ తన ఇష్టమైన మేరకే వదిలేశారు… అది సినిమానా లేక స్టడీఅన్నది త్వరలో డిసైడ్ కానుంది ఒక వేళ అకీరా సినిమాలపై ఇంట్రస్ట్ చూపితే ఆ బాధ్యతలను రామ్ చరణ్ తీసుకోనున్నారని సమాచారం… ఫ్యామిలీ పరంగా కాకుండా చరణ్ కు బాబాయ్ పవన్ అంటే అభిమానం అందుకే అకీరా బాధ్యతలను తీసుకున్నట్లు సమాచారం…