ఇంచార్జ్‌ల మార్పు మూడో జాబితాను వైసీపీ(YSRCP Third List) అధిష్టానం విడుదల చేసింది. ఈ జాబితాలో 21 మందికి చోటు కల్పించింది. ముఖ్యంగా రాయలసీమకు చెందిన స్థానాల్లో కీలక మార్పలు చేసింది. మంత్రి జోగి రమేశ్‌ను పెడన నుంచి పెనమాలూరుకు మార్చగా.. మరో మంత్రి జయరాంను కర్నూలు ఎంపీ అభ్యర్థిగా ప్రకటించారు. కాగా తొలి జాబితాలో 11 మంది.. రెండో జాబితాలో 27 మందిని ప్రకటించిన సంగతి తెలిసిందే.
YSRCP Third List:
ఎంపీ అభ్యర్థులు..
విశాఖపట్నం ఎంపీ – బొత్స ఝాన్సి
విజయవాడ – కేశినేని నాని
శ్రీకాకుళం – పేరాడ తిలక్
కర్నూల్ ఎంపీ – గుమ్మనూరి జయరాం
తిరుపతి ఎంపీ – కోనేటి ఆదిమూలం
ఏలూరు – కారుమూరి సునీల్ కుమార్ యాదవ్
ఎమ్మెల్యే అభ్యర్థులు..
ఇచ్ఛాపురం – పిరియ విజయ
టెక్కలి – దువ్వాడ శ్రీనివాస్
చింతలపూడి (ఎస్సీ) – కంభం విజయరాజు
రాయదుర్గం – మెట్టు గోవింద్ రెడ్డి
దర్శి – బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి
పూతలపట్టు (ఎస్సీ) – మూతిరేవుల సునీల్ కుమార్
చిత్తూరు – విజయానంద రెడ్డి
మదనపల్లె – నిస్సార్ అహ్మద్
రాజంపేట – ఆకేపాటి అమర్ నాథ్ రెడ్డి
ఆలూరు – బూసినే విరూపాక్షి
కోడుమూరు (ఎస్సీ) – డాక్టర్ సతీష్
గూడూరు (ఎస్సీ) – మేరిగ మురళి
సత్యవేడు (ఎస్సీ) – మద్దిల గురుమూర్తి
పెనమలూరు – జోగి రమేశ్
పెడన – ఉప్పాల రాము