వైసీపీ నాలుగో జాబితా(YCP Fourth list)లో పలువురు సిట్టింగ్‌లకు షాక్ తగిలింది. 9మందితో ప్రకటించిన ఈ జాబితాలో 8 ఎస్సీ నియోజకవర్గాలే కావడం విశేషం. ఇందులో ఓ ఎంపీ, 8 ఎమ్మెల్యే స్థానాలు ఉన్నాయి. జాబితాను పరిశీలిస్తే చిత్తూరు ఎంపీగా ఉన్న రెడ్డప్పను గంగాధర నెల్లూరు ఎమ్మెల్యే అభ్యర్థిగానూ, అక్కడ ఎమ్మెల్యేగా ఉన్న నారాయణస్వామిని చిత్తూరు పార్లమెంట్ ఇంఛార్జ్‌గానూ మార్చారు. గోపాలపురం ఎమ్మెల్యేగా ఉన్న తలారి వెంకట్రావును కోవూరు నియోజకవర్గ ఇంచార్జ్‌గానూ, కోవూరు ఎమ్మెల్యేగా ఉన్న మంత్రి తానేటి వనితను గోపాలపురం నియోజకవర్గం ఇంచార్జ్‌గానూ ఛేంజ్ చేశారు.
YCP Fourth list | ఇక శింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి స్థానంలో వీరాంజనేయులు, కనిగిరి ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్ యాదవ్ స్థానంలో దద్దాల నారాయణ యాదవ్, తిరువూరు ఎమ్మెల్యే రక్షణనిధి స్థానంలో స్వామిదాస్, మడకశిరలో ఎం.తిప్పేస్వామి స్థానంలో ఈర లక్కప్ప, నందికొట్కూరులో ఆర్థర్‌కు బదులుగా డా.సుధీర్‌కు కొత్త ఇంచార్జ్‌లుగా చోటు కల్పించారు. కాగా తొలి జాబితాలో 11 ఎమ్మెల్యే స్థానాలు, రెండో జాబితాలో 3 ఎంపీ, 24 ఎమ్మెల్యే, మూడో జాబితాలో 6 ఎంపీ, 15 ఎమ్మెల్యే, నాలుగో జాబితాలో ఎంపీ, 8 ఎమ్మెల్యేల అభ్యర్థులతో కలిపి ఇప్పటివరకు మొత్తం 10 ఎంపీ, 58 ఎమ్మెల్యే స్థానాలకు ఇంఛార్జ్‌లను మార్చింది.