TSRTC Employees | సీఎం రేవంత్ ఇంటికి భారీగా ఆర్టీసీ ఉద్యోగులు.. అడ్డుకున్న పోలీసులు..

-

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసేందుకు సస్పెండైన ఆర్టీసీ ఉద్యోగులు(TSRTC Employees) పెద్దఎత్తున హైదరాబాద్‌కు తరలివచ్చారు. జూబ్లీహిల్స్‌లోని సీఎం నివాసం వద్దకు వచ్చిన వారిని పోలీసులు అడ్డుకున్నారు. గత ప్రభుత్వంలో తమకు తీవ్ర అన్యాయం జరిగిందని, తమ గోడును సీఎంకు విన్నవించుకునేందుకు వచ్చినట్లు మొరపెట్టుకున్నారు. చిన్నచిన్న కారణాలతో 1500 మందిని ఉద్యోగాల నుంచి తీసివేశారని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే తమను విధుల్లోకి తీసుకోవాలని సీఎంకు వినతిపత్రం ఇచ్చేందుకు ఇక్కడి వచ్చామని వాపోయారు.

- Advertisement -

TSRTC Employees | దీంతో సీఎంను కలిసి వినతిపత్రం ఇచ్చేందుకు ముగ్గురికి మాత్రమే పోలీసులు అనుమతి ఇచ్చారు. కేవలం చిన్న చిన్న కారణాలను సాకుగా చూపి తమను ఉద్యోగాల నుంచి తొలగించారని.. దయచేసి తిరిగి విధుల్లోకి తీసుకోవాలని రేవంత్ రెడ్డి(Revanth Reddy)ని వేడుకున్నారు. వారి సమస్యలపై ఆయన సానుకూలంగా స్పందించారు.

Read Also: సీఎం రేవంత్ రెడ్డిని అందుకే కలిశాం: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు
Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Bengaluru | శ్రీదేవి’ ప్రేమ కంపెనీ.. ముద్దుకు రూ.50 వేలు, చాట్ కి రూ. 50 లక్షలు!!

Bengaluru | టీచర్ తో రొమాన్స్ చేసినందుకు ఓ వ్యాపారి భారీగా...

HCU Land Issue | ‘రాబర్ట్ వాద్రా కోసం 400 ఎకరాల భూములతో రియల్ ఎస్టేట్ వ్యాపారం!!’

HCU Land Issue | కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు...