గవర్నర్ కోటాలో ఇద్దరు ఎమ్మెల్సీలను గవర్నర్ తమిళిసై సౌందరరాజన్(Governor Tamilisai) ఎంపిక చేశారు. ఎమ్మెల్సీలుగా ప్రొఫెసర్ కోదండరామ్(Prof Kodandaram), మీర్ అమీర్ అలీ ఖాన్(Mir Amir Ali Khan)ను ఎంపిక చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. గవర్నర్ కోటాలో వీరిద్దరి పేర్లను ప్రభుత్వం నామినేట్ చేయగా.. గవర్నర్ ఆమోదం తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన కోదండరామ్ సేవలు వినియోగించుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి భావించారు. అందుకే ఆయనకు ఎమ్మెల్సీ పదవి అప్పగించారు. గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఆయన మద్దతు ఇచ్చారు.
కాగా ఇటీవల ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులుగా బల్మూరి వెంకట్(Balmoori Venkat), బొమ్మ మహేష్‌కుమార్ గౌడ్(Mahesh Kumar Goud) ఏకగ్రీవంగా ఎంపికైన సంగతి తెలిసిందే. దీంతో రాష్ట్రంలో ఖాళీగా ఉన్న నాలుగు ఎమ్మెల్సీ స్థానాలను కాంగ్రెస్ కైవసం చేసుకుంది. సామాజిక సమీకరణాలతో పాటు మిగతా అంశాలను దృష్టిలో పెట్టుకుని అభ్యర్థులను ఎంపిక చేశారు.