తెలంగాణలోని వివిధ కోర్సుల్లో ప్రవేశాల్లో నిర్వహించే పరీక్షల షెడ్యూలను ఉన్నత విద్యామండలి ప్రకటించింది. ఎంసెట్, ఈసెట్, లాసెట్, పీజీసెట్, ఐసెట్, ఎడ్‌సెట్, పీజీఈ సెట్‌కు సంబంధించిన కామన్ ఎంట్రన్స్ టెస్టులకు సంబంధించిన పరీక్షల తేదీలను వెల్లడించింది. అయితే ఈసారి ఎంసెట్(TS EAMCET) పేరును ‘టీఎస్ ఈఏపీసెట్(TS EAPCET)’గా మారుస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ ప్రవేశ పరీక్షలకు సంబంధించిన నోటిఫికేషన్లు, షెడ్యూల్, రిజిస్ట్రేషన్ ఫీజు తదితర వివరాలను సంబంధిత పరీక్షల కన్వీనర్లు వెల్లడిస్తారని తెలిపింది. మే 6 నుంచి ప్రారంభమయ్యే ఈ పరీక్షలు జూన్ 13తో ముగియనున్నాయి.
పరీక్షల షెడ్యూలు ఇలా..
మే 6 : తెలంగాణ ఈసెట్ – ఉస్మానియా యూనివర్సిటీ
మే 9 నుంచి 11 వరకు: TS EAMCET – TS EAPCET (ఇంజినీరింగ్)- జేఎన్‌టీయూహెచ్
మే 12, 13 వరకు: (అగ్రికల్చరల్ అండ్ ఫార్మా) – జేఎన్‌టీయూహెచ్
మే 23: టీఎస్ ఎడ్‌సెట్- మహాత్మాగాంధీ యూనివర్సిటీ
జూన్ 3: టీఎస్ లా సెట్, పీజీఎల్‌సెట్- ఉస్మానియా యూనివర్సిటీ
జూన్ 4, 5: టీఎస్ ఐసెట్- కాకతీయ యూనివర్సిటీ
జూన్ 6 నుంచి 8వరకు: టీఎస్ పీజీఈసెట్- జేఎన్‌టీయూహెచ్
జూన్ 10 నుంచి 13 వరకు: టీఎస్ పీఈసెట్- శాతవాహన యూనివర్సిటీ