Budget 2024 | 2047 నాటికి భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. మొత్తం రూ.47.66 లక్షల కోట్లతో మధ్యంతర బడ్జెట్‌ను పార్లమెంట్‌లో ప్రవేశపెట్టారు. సుమారు 57 నిమిషాల పాటు బడ్జెట్‌పై ప్రసంగం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గత పదేళ్లలో దేశ ఆర్థిక వ్యవస్థలో అనేక గుణాత్మక మార్పులు వచ్చాయన్నారు. 25 కోట్ల మంది ప్రజలను పేదరికం నుంచి బయటపడేశామని తెలిపారు.
కేంద్ర పథకాలకు కేటాయింపులు..
గ్రామీణ ఉపాధి హామీ పథకం: రూ. 86వేల కోట్లు
ఆయుష్మాన్ భారత్ : రూ.7,500 కోట్లు
పారిశ్రామిక ప్రోత్సాహకాలకు : రూ.6,200 కోట్లు
సెమీ కండక్టర్స్, డిస్‌ప్లే ఎకో వ్యవస్థల తయారీకి: రూ.6,903 కోట్లు
సోలార్ విద్యుత్ గ్రిడ్‌కి: రూ.8,500 కోట్లు
గ్రీన్ హైడ్రోజన్ మిషన్‌కి: రూ.600 కోట్లు
శాఖల వారీగా Budget 2024 కేటాయింపులు..
రక్షణ రంగానికి రూ.6.2 లక్షల కోట్లు
ఉపరితల రవాణా, జాతీయ రహదారులు రూ.2.78 లక్షల కోట్లు
రైల్వే శాఖకి రూ. 2.55 లక్షల కోట్లు
వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీకి రూ.2.13 లక్షల కోట్లు
హొం శాఖకు రూ.2.03 లక్షల కోట్లు
గ్రామీణాభివృద్ధికి రూ.1.77లక్షల కోట్లు
రసాయనాలు, ఎరువులకి రూ.1.68 లక్షల కోట్లు
కమ్యూనికేషన్ల వ్యవస్థకి రూ.1.37 లక్షల కోట్లు
వ్యవసాయం, రైతు సంక్షేమానికి రూ.1.27 లక్షల కోట్లు