నేచురల్ స్టార్ నాని ఎంచుకునే కథలు చాలా డిఫరెంట్ గా ఉంటాయి.. అలాంటి కథలు ఉన్నా నాని ఇంటి ముందు ఉంటారు దర్శకులు. ఎందుకు అంటే ఆయన వాటిని లైక్ చేస్తారు కాబట్టి.. అందుకే విభిన్న కథలకు నాని కేరాఫ్ అడ్రస్ అనే చెప్పాలి, ఇక తనలా కొత్త దర్శకులు కూడా రావాలి అని అనుకుంటాడు. కొత్త దర్శకులని ప్రొత్పహిస్తాడు. తాజాగా అదే పందాతో కొత్త డైరెక్టర్లతో తన సినిమాలు చేస్తున్నాడు.
ఇక నాని ఇప్పుడు టాలీవుడ్ లో మరో కొత్త దర్శకుడికి అవకాశం ఇవ్వనున్నారు అని టాక్ అయితే నడుస్తోంది…దర్శకుడు సుకుమార్ దగ్గర అసోసియేట్గా పనిచేసిన శ్రీకాంత్.. ఇటీవల నానికి ఓ కథ వినిపించాడట. ఈకథ తనకు బాగా నచ్చింది అని నాని తెలియచేశాడట, సుకుమార్ దగ్గర వర్క్ అంటేనే కాస్త డిఫరెంట్ గా ఉంటుంది. అందుకే ఆ కథ కూడా బాగా నచ్చింది అని అంటున్నారు. పైగా ఇది ఓ లవ్ యాస్పెక్ట్ స్టోరీ అని తెలుస్తోంది. అందుకే ఈ సినిమా చేసేందుకు నాని గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం.
ఇక నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం ఇంద్రగంటి మోహన్ దర్శకత్వంతో తెరకెక్కుతున్న వి చిత్రం చేస్తున్నారు.. తర్వాత శివ నిర్వాణ తో చేయనున్నారు సినిమా ఇక తర్వాత శ్రీకాంత్ కాన్పెస్ట్ పట్టాలెక్కనుంది, అంటే వచ్చే ఏడాది ఇది షూట్ కు వెళుతుందట.