దివంగత భారత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు(PV Narasimha Rao)కు దేశ అత్యున్నత పురస్కారం ‘భారతరత్న’ వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో తెలుగు రాష్ట్రా ప్రముఖులతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖులు స్పందిస్తున్నారు. అయితే ఏపీ సీఎం వైఎస్ జగన్ మాత్రం స్పందించేందుకు నిరాకరించడం గమనార్హం. ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న జగన్(CM Jagan).. పార్లమెంట్ నుంచి బయటకు వస్తుండగా జాతీయ మీడియా ప్రతినిధులు పీవీకి భారతరత్న రావడంపై మీ స్పందన ఏంటని అడిగారు. అయితే ఆయన మాత్రం స్పందించకుండా ఎంపీ విజయసాయిరెడ్డి స్పందిస్తారని చెప్పి కారెక్కి వెళ్లిపోయారు.
ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో తెలుగు వ్యక్తికి అత్యున్నత పురస్కారం రావడంపై స్పందించాలని ఎన్నిసార్లు అడిగినా జగన్(CM Jagan) పట్టించుకోకుండా వెళ్లడంపై నెటిజన్లు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. దేశం మొత్తం మెచ్చిన దిగ్గజ నేతకు తెలుగు రాష్ట్రాలకు చెందిన ఓ ముఖ్యమంత్రి ఇచ్చే మర్యాద ఇదేనా అంటూ ప్రశ్నిస్తున్నారు.
Press : పీవీ నరసింహారావు కు భారతరత్న రావటం పట్ల మీ స్పందన ఏంటి!??
జైలు రెడ్డి : సాయిరెడ్డి చెప్తాడు
Press : మీ రాష్ట్ర సీఎం కూడా సాయిరెడ్డేనా!?అని అడిగిన మహిళా విలేఖరి 😂😂
ఒక గ్లాస్ వాటర్ లో దూకరా పిచ్చోడు pic.twitter.com/2bZUUB3OgK
— Venu M Popuri (@Venu4TDP) February 9, 2024