YS Sharmila | నా ప్రశ్నలకు సమాధానం చెప్పాలి.. వైసీపీ నేతలకు షర్మిల సవాల్..

-

ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల(YS Sharmila) వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తూనే ఉన్నారు. ప్రభుత్వ విధానాలను, వైఫల్యాలను ఎండగడుతున్నారు. తాజాగా ఎన్నికల సమయంలో డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల చేయడాన్ని తప్పు పట్టారు. తన ప్రశ్నలకు సమాధానం చెప్పే దమ్ముందా అంటూ వైసీపీ నేతలకు సవాల్ విసిరారు.

- Advertisement -

‘మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి 52 వేల పోస్టులతో మెగా డీఎస్సీ వేస్తే.. వారసుడిగా చెప్పుకొనే జగన్ అన్న 6 వేలతో వేసింది “దగా డీఎస్సీ”. ప్రశ్నిస్తే వ్యక్తిగత విమర్శలు చేసే వైసీపీ నాయకులు.. వీళ్ళను మోసే సోషల్ మీడియాకు ఒక సవాల్.

2019 ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లు 25వేల టీచర్ పోస్టుల భర్తీ ఎక్కడ?

5 ఏళ్లు నోటిఫికేషన్ ఇవ్వకుండా కాలయాపన ఎందుకు చేశారు?

ఎన్నికలకు నెలన్నర ముందు 6 వేల పోస్టుల భర్తీ చేయడంలో ఆంతర్యం ఏమిటి?

టెట్, డీఎస్సీ కలిపి నోటిఫికేషన్ ఇస్తే అభ్యర్థులు దేనికి ప్రిపేర్ అవ్వాలి?

నోటిఫికేషన్ ఇచ్చిన 30 రోజుల్లో పరీక్షలు పెట్టడం దేశంలో ఎక్కడైనా ఉందా?

టెట్ కి 20 రోజులు, తర్వాత డీఎస్సీ మద్య కేవలం 6 రోజుల వ్యవధా?

వైఎస్ఆర్ హాయాంలో 100 రోజుల గడువు ఇచ్చిన సంగతి వారసుడు జగన్‌కి గుర్తులేదా?

ఇచ్చిన సిలబస్ ప్రకారం ఒక్కో అభ్యర్థి 150 పుస్తకాలు చదవాలని మీకు తెలియదా?

రోజుకి 5 పుస్తకాలు చదవడం అభ్యర్థులకు సాధ్యపడే పనేనా?

మానసిక ఒత్తిడికి గురిచేసి నిరుద్యోగులను పొట్టన పెట్టుకోవాలని కుట్ర చేస్తున్నారా? ఇది కక్ష్య సాధింపు చర్య కాదా?

నవ రత్నాలు, జాతి రత్నాలు అని చెప్పుకొనే జగన్ ఆన్న.. ఆయన చుట్టూ ఉండే సకలం శాఖ మంత్రులు ఈ 9 ప్రశ్నలకు దమ్ముంటే సమాధానం చెప్పాలి’’ అని షర్మిల(YS Sharmila) డిమాండ్ చేశారు.

Read Also: డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఇంట తీవ్ర విషాదం
Follow us on: Google NewsKoo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

KTR | ఫార్ములా – ఈ కార్ రేసు : కేటీఆర్ కి జలకిచ్చిన ఏసీబీ

బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ KTR కి ఏసీబీ జలకిచ్చింది. ఫార్ములా- ఈ...

HMPV Virus | టెన్షన్.. టెన్షన్.. భారత్ లో 3 హెచ్ఎంపీవీ కేసులు

చైనాను వణికిస్తున్న HMPV Virus భారత్ ను తాకింది. మూడు పాజిటివ్...