ఢిల్లీ లిక్కర్ స్కామ్, మనీ లాండరింగ్ కేసులో CM కేజ్రీవాల్ కి మరోసారి ఈడీ సమన్లు జారీ చేసింది. ఈ నెల 19 న తమ ఎదుట విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. కేజ్రీవాల్(Kejriwal) కి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నోటీసులు పంపడం ఇది ఆరోసారి కావడం గమనార్హం. ఎన్నిసార్లు ఈడీ నోటీసులు పంపించినా సీఎం కేజ్రీవాల్ విచారణకు హాజరు కాకుండా తప్పించుకుంటున్నారు.
ఈ నేపథ్యంలో ఈడీ(ED) ఢిల్లీ కోర్టును ఆశ్రయించింది. దీంతో ఫిబ్రవరి 17న విచారణకు హాజరు కావాలని కోర్టు ఆదేశాలిచ్చింది. కాని పక్షంలో ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కేజ్రీవాల్ పాత్ర ఉందని ప్రాథమిక నిర్ధారణకు వస్తామని స్పష్టం చేసింది. ఈ క్రమంలో మరోసారి ఈడీ నోటీసులు జారీ చేయడం ఆసక్తికరంగా మారింది. కాగా, గత ఏడాది నవంబర్ 2న లిక్కర్ స్కాం లో తొలిసారి కేజ్రీవాల్(Kejriwal) ఈడీ నోటీసులు అందుకున్నారు.