CAG Report | తెలంగాణ అసెంబ్లీలో హీటెక్కిస్తున్న కాగ్ రిపోర్ట్

-

తెలంగాణ అసెంబ్లీ హాట్ హాట్ గా నడుస్తోంది. గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతిపై రేవంత్ టీమ్ తీవ్ర స్థాయిలో ఆరోపణలు గుప్పిస్తోంది. నీటి పారుదల శాఖలో అక్రమాలు జరిగాయని అధికార పక్షం చేస్తోన్న ఆరోపణలపై ఇరువర్గాల మధ్య వాడివేడి చర్చలు నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన కాగ్ రిపోర్ట్(CAG Report) కాక రేపుతోంది. నివేదికలో పొందుపరిచిన అంశాలను ప్రస్తావిస్తూ BRS శ్రేణులపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తింది. ఇంతకీ కాగ్ రిపోర్టులో ఏముందంటే..

- Advertisement -

ప్రాణహిత ప్రాజెక్టులో ఎలాంటి పురోగతి లేదని నివేదిక వెల్లడించింది. దీనికోసం ఖర్చుపెట్టిన రూ.878 కోట్లు వృథా అయ్యాయని రిపోర్టు పేర్కొంది. రీఇంజనీరింగ్ పేరుతో నిధులు దుర్వినియోగం చేశారని నివేదికలో పొందుపరిచారు. ప్రాణహిత మీద 2022 నాటికి రూ. 1727 కోట్లు ఖర్చు చేశారని కాళేశ్వరంపై రూ.86,788 కోట్లు ఖర్చు అయిందని నివేదిక తేల్చింది. కాళేశ్వరంపై అంతర్రాష్ట్ర సమస్యలు, నిల్వ సామర్థ్యం, సౌకర్యాలపై సరైన అధ్యయనం చేయలేదని పేర్కొంది. అస్తవ్యస్తంగా పనులు ప్రారంభించారని తెలిపింది.

ఈ సందర్భంగా.. మహారాష్ట్రలో ముంపు సమస్యను కూడా కాగ్ రిపోర్ట్(CAG Report) లో ప్రస్తావించింది. ప్రాజెక్టు వ్యయం 122 శాతం పెరిగినా ఆయకట్టు 52 శాతం మాత్రమే పెరిగిందని స్పష్టం చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టు పై వడ్డీతో సహా రూ. కోటి 47 లక్షల 427 వేల అప్పు పెరిగిందని తెలియజేసింది. ప్రాణహిత ప్రాజెక్టు డీపీఆర్ కూడా లేదని వెల్లడించింది. మార్పుల కారణంగా కొన్ని పనులు వృధా అయ్యాయని పేర్కొంది. ఫలితంగా రూ.767 కోట్ల నష్టం జరిగిందని కాగ్ నివేదిక బయటపెట్టింది. కాళేశ్వరం డీపీఆర్ తయారుచేసిన వాప్కోస్ పనితీరులో లోపాలు ఉన్నాయని వెల్లడించింది. రీ ఇంజనీరింగ్ కూడా అదే సంస్థకు అప్పగించారని తెలిపింది.

2018లో కాళేశ్వరం డీపీఆర్(DPR) ని కేంద్ర జలసంఘం ఆమోదించకముందే 17 రకాల పనులు రూ. 25 వేల 49 కోట్లకి అప్పగించారని కాగ్ తేల్చి చెప్పింది. డీపీఆర్ తర్వాత కూడా ప్రాజెక్టు పనుల్లో మార్పులు చేశారని నివేదిక స్పష్టం చేసింది. ముందు రెండు టీఎంసీలు ఎత్తిపోయాలని ప్రతిపాదించి, ఆ తర్వాత అవసరం లేకున్నా మూడు టీఎంసీలకు ప్రతిపాదించారని రిపోర్టులో వెల్లడైంది. దీంతో రూ.28,151 కోట్ల అదనపు భారం పెరిగిందని కాగ్ కుండబద్దలు కొట్టినట్లు చెప్పింది.

Read Also: ఎలక్టోరల్ బాండ్లు రాజ్యాంగ విరుద్ధం.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు
Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

ఎమ్మెల్సీ అభ్యర్థి అశోక్ పై కాంగ్రెస్ దాడి

నల్గొండ జిల్లా నార్కెట్ పల్లి మండల కేంద్రంలోని డోకూరు పంక్షన్ హాలులో...

ఈ నవరత్నాలు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి

Health Benefits of Millet | మన భారత దేశంలోని రైతులు...