Nadendla Manohar | ప్రశ్నిస్తే పవన్ కల్యాణ్‌పై కేసులు పెడతారా..? నాదెండ్ల ఫైర్ 

-

వాలంటీర్ల గురించి వాస్తవాలు మాట్లాడిన జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై తప్పుడు కేసులు పెడతారా అంటూ ఆ పార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్(Nadendla Manohar) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వాలంటీర్ వ్యవస్థ లో ఉన్న లోపాలు ఎత్తి చూపిస్తే బెదిరింపులకు దిగుతున్నారని ఫైర్ అయ్యారు. వ్యక్తిగత సమాచారం తీసుకునే హక్కు మీకు ఎవరు ఇచ్చారు..? అని ప్రశ్నించారు. స్వయంగా సీఎం జగన్ వాలంటీర్లను తన సైన్యం అని చెప్పుకుంటున్నారని మండిపడ్డారు. అలాంటి సైన్యంలోని 2,55,461 మంది వాలంటీర్లలో 1,02,836 వాలంటీర్ల డేటా అసలు రికార్డులలోనే లేదని ఆరోపించారు. రికార్డుల్లో లేని ఆ వాలంటీర్ల కోసం రూ.617 కోట్లు దోచుకుంటున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ సమస్యపై సీఎం జగన్ ఎప్పుడైనా మాట్లాడారా అని నిలదీశారు.

- Advertisement -

‘వాలంటీర్ వ్యవస్థను వైసీపీ వ్యవస్థగా చెబుతున్నారు. దీని గురించి జనసేనాని పవన్ మాట్లాడిన విషయాలపై కేసు నమోదు చేశారు. వారి కోసం ప్రతి ఏడాది రూ.1,560 కోట్లు ఖర్చు చేస్తుండగా.. 1,02,836 మంది వాలంటీర్ల డేటా నమోదు కాలేదు. దానిలో రూ.617 కోట్ల డేటా సేకరణ కోసం కేటాయించారు. ఈ నిధులు ఎవరి జేబుల్లోకి వెళ్తున్నాయి. ఇంటింటి సమాచారం సేకరించాలని వారికి ఎవరు చెప్పారు.? ఈ వ్యవస్థకు చట్టపరమైన గుర్తింపు ఉందా.? అలా సేకరించిన సమాచారాన్ని ఎక్కడ భద్రపరుస్తున్నారు..? ఈ ప్రశ్నలు వేటికీ సమాధానం చెప్పకుండా మంత్రులు, వైసీపీ నేతలు ఎదురుదాడికి దిగుతున్నారు. జనసేన పార్టీకి వాలంటీర్లపై ఎలాంటి వ్యక్తిగత కక్ష లేదు..’ అని స్పష్టం చేశారు. తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే వాలంటీర్ల పేరుతో దోచుకున్న డబ్బుపై విచారణ చేయిస్తామని నాదెండ్ల(Nadendla Manohar) హెచ్చరించారు.

Read Also: జగన్‌కు చిప్పు దొబ్బింది.. నారా లోకేష్ తీవ్ర విమర్శలు..
Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

ఎమ్మెల్సీ అభ్యర్థి అశోక్ పై కాంగ్రెస్ దాడి

నల్గొండ జిల్లా నార్కెట్ పల్లి మండల కేంద్రంలోని డోకూరు పంక్షన్ హాలులో...

ఈ నవరత్నాలు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి

Health Benefits of Millet | మన భారత దేశంలోని రైతులు...