Eenadu office | ‘ఈనాడు’ కార్యాలయంపై దాడిని ఖండించిన చంద్రబాబు, పవన్ కల్యాణ్ 

-

కర్నూలులోని ‘ఈనాడు’ కార్యాలయంపై వైసీపీ నేతలు చేసిన దాడిని టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ తీవ్రంగా ఖండించారు. ‘‘రాబోయే ఎన్నికల్లో ఓటమి తప్పదని జగన్‌ తన అనుచరులను రెచ్చగొడుతున్నారు. ప్రభుత్వ ప్రేరేపిత ఉగ్రవాదం ప్రజల్ని భయపెట్టే చివరి ప్రయత్నమే. ఏపీలో మునుపెన్నడూ లేనివిధంగా శాంతిభద్రతలు దెబ్బతిన్నాయి. వైసీపీ హింసాత్మక చర్యలకు మరో 50 రోజుల్లో ముగింపు పలుకుతాం. ఇటీవల ఆంధ్రజ్యోతి ఫొటోగ్రాఫర్‌, టీవీ5 విలేకరిపై జరిగిన దాడిలో వారు తీవ్రంగా గాయపడ్డారు. ఇలాంటి ఘటనలు అనాగరిక చర్యలకు పరాకాష్ఠ” అని చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

- Advertisement -

“వైసీపీ సర్కార్‌ వైఫల్యాలు, అవినీతి, ఆ పార్టీ నేతల అక్రమాలను బయటకు తీసుకువస్తున్నారనే అక్కసుతో పాత్రికేయుల మీద, మీడియా కార్యాలయాలపైన దాడులు చేయడం అప్రజాస్వామికం. కర్నూలు నగరంలోని ‘ఈనాడు’ ప్రాంతీయ కార్యాలయంపై వైకాపా ఎమ్మెల్యే అనుచరులు దాడికి తెగబడటం గర్హనీయం. పత్రికా స్వేచ్ఛకు విఘాతం కలిగిస్తున్నారు. రాప్తాడులో ఆంధ్రజ్యోతి ఫొటోగ్రాఫర్‌ శ్రీకృష్ణపై విచక్షణారహితంగా వైకాపా మూకలు చేసిన దాడి ఆ పార్టీవాళ్ల హింసా ప్రవృత్తిని వెల్లడించింది. ఇప్పుడు ‘ఈనాడు’పై అదే పంథా చూపించారు. ప్రజాస్వామ్యవాదులు ఈ హింసను ఖండించాలి” అని పవన్ పేర్కొన్నారు.

“పత్రికా స్వేచ్ఛను వైసీపీ ప్రభుత్వం హరిస్తోందనడానికి ఈ దాడులే నిదర్శనం. నిజాలు జీర్ణించుకోలేక నిందలు మోపడం, దాడులకు దిగడం, కొట్టి చంపడం అధికార పార్టీకి వెన్నతో పెట్టిన విద్య. జర్నలిస్టులు, పత్రికా కార్యాలయాలపై దాడులకు పాల్పడటం వైసీపీ పాలనలో నిత్యకృత్యం. పత్రికా ప్రతినిధులపై దాడి అంటే ప్రజాస్వామ్యంపై దాడి చేసినట్టే. నిందితులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలి” అని ఏపీసీసీ చీఫ్‌ షర్మిల డిమాండ్‌ చేశారు. కాగా కర్నూలులోని ‘ఈనాడు’ కార్యాలయంపై పాణ్యం వైసీపీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి అనుచరులు దాడికి పాల్పడిన సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

HCU Land Issue | ‘రాబర్ట్ వాద్రా కోసం 400 ఎకరాల భూములతో రియల్ ఎస్టేట్ వ్యాపారం!!’

HCU Land Issue | కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు...

RRR Custodial Case | RRR కస్టోడియల్ టార్చర్ కేసులో కీలక పరిణామం

టీడీపీ ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో(RRR Custodial Case)...