దివంగత మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు(Viveka Murder Case)లో అప్రూవర్‌గా మారిన దస్తగిరి తన ప్రాణాలకు ముప్పు ఉందని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆశ్రయించాడు. అప్రూవర్‌గా మారినందుకు వైసీపీ ప్రభుత్వం బెదిరిస్తోందని ఆరోపించాడు. అందుచేత ప్రభుత్వంతో తనకు ప్రాణహాని ఉందని తగిన భద్రత కల్పించాలని సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేస్తున్నట్లు తెలిపాడు. కాగా సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో వివేకా హత్య కేసు విచారణ తెలంగాణ హైకోర్టులో జరుగుతున్న సంగతి తెలిసిందే.
కాగా వివేకా హత్య కేసు(Viveka Murder Case)లో అప్రూవర్‌గా మారిన అనంతరం దస్తగిరి బెయిల్ పై బయటికి వచ్చాడు. ఇటీవల ఓ ప్రేమ జంట వ్యవహారంలో కిడ్నాప్, దాడి కేసుల్లో ఇరుక్కున్నాడు. ప్రస్తుతం ఈ రెండు కేసుల్లో బెయిల్ లభించడంతో కడప జైలు నుంచి విడుదలయ్యాడు. మరి దస్తగిరి విజ్ఞప్తి తెలంగాణ ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి.