YS Sunitha : జగన్ కి పాలించే హక్కు లేదు.. వివేకా కేసులో సంచలన నిజాలు బయటపెట్టిన సునీత

-

దివంగత మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి కుమార్తె వైయస్ సునీత సంచలన ప్రెస్ మీట్ పెట్టారు. తన తండ్రి వివేకాను చంపిన వారిని తన సోదరుడు సీఎం జగన్ కాపాడుతున్నారంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. హత్యా రాజకీయాలను ప్రోత్సహిస్తున్న తన అన్న పార్టీ వైసీపీని ఓడించాలంటూ ప్రజలకు పిలుపునిచ్చారు. ఢిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మట్లాడుతూ వివేకా హత్య కేసుకు సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు.

- Advertisement -

‘‘సాధారణంగా హత్య కేసుల్లో ఎవరు మర్డర్ చేశారనేది 4-5 రోజుల్లో తెలిసిపోతుంది. వివేకానంద రెడ్డి గారి కేసులో ఐదేళ్లైనా ఇంకా ఎందుకు తెలియడం లేదు? 2017 ఎమ్మెల్సీ ఎన్నికల్లో వివేకా గారు పోటీ చేశారు. ఓడించాలని కొందరు ప్రయత్నించారు. సొంతవారే మోసం చేయడంతో వివేకా ఓడిపోయారు. అయినా నిరాశ చెందకుండా.. మరింత యాక్టివ్‌ అయ్యారు. ఎంత ప్రయత్నించినా ఆయన్ను అణగదొక్కలేకపోతున్నామనే భయం ప్రత్యర్థుల్లో ఎక్కువైంది. అప్పట్లో మాకు ఇదంతా అర్థం కాలేదు” అన్నారు.

“హత్య తర్వాత మార్చి 15, 2019న మార్చురీ బయట అవినాష్‌ నా వద్దకు వచ్చారు. రాత్రి 11.30 గంటల వరకు పెదనాన్న తనకోసం ఎన్నికల ప్రచారం చేశారని చెప్పారు. సినిమాల్లో చూపించే విధంగా హంతకులు మన మధ్యే ఉంటారు.. మనం మాత్రం రియలైజ్‌ కాలేం. వివేకాను చంపిన వారిని వదిలిపెడితే ఏం సందేశం వెళ్తుంది? సీబీఐ దర్యాప్తు ఎందుకు త్వరగా పూర్తి కావట్లేదు? హత్యా రాజకీయాలు ఉండకూడదు. వంచన, మోసానికి పాల్పడిన మా అన్న పార్టీ వైసీపీకి ఓటు వేయొద్దు. ఈ కేసులో నిందితులుగా అవినాష్‌, భాస్కర్‌రెడ్డిని ఇంకా రక్షిస్తూనే ఉన్నారు. ఇదే ప్రభుత్వం మళ్లీ వస్తే ఇంకా కష్టాలే. జగన్‌ పాత్రపై కూడా విచారణ చేయాలి.. నిర్దోషి అయితే వదిలేయాలి’’ అని సునీత వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

NTR ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. 3 అప్డేట్స్ కి రెడీ గా ఉండండి

ఎన్టీఆర్(Jr NTR) హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా 'దేవర'....

THSTI లో ప్రాజెక్ట్ రీసెర్చ్ స్టాఫ్ కి నోటిఫికేషన్

ఫరీదాబాద్ (హరియాణా)లోని ప్రభుత్వరంగ సంస్థకు చెందిన ట్రాన్టేషనల్ హెల్త్ సైన్స్ అండ్...