Chandrababu | గవర్నర్‌కు చంద్రబాబు లేఖ.. వ్యవస్థలను కాపాడాలని విజ్ఞప్తి..

-

టీడీపీ అధినేత చంద్రబాబు(Chandrababu) రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్‌కు లేఖ రాశారు. టీడీపీ నేతలు, కార్యకర్తల అణచివేతే లక్ష్యంగా వైసీపీ ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టి వేధిస్తోందని లేఖలో పేర్కొన్నారు. టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు(Prathipati Pullarao) కుమారుడు శరత్‌ను అక్రమంగా అరెస్టు చేసిన విషయాన్ని ఇందులో ప్రస్తావించారు.

- Advertisement -

“ప్రభుత్వ విభాగాల ద్వారా టీడీపీ నేతలు, కార్యకర్తలపై సీఎం జగన్ అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారు. APSDRI ద్వారా టీడీపీ నేతలను బెదిరించి ఆర్థికంగా, రాజకీయంగా ఇబ్బందులకు గురిచేస్తున్నారు. APSDRIను ప్రతిపక్షాలను వేధించేందుకు ఆయుధంగా ప్రభుత్వం వాడుకుంటోంది. అధికార పార్టీకి విధేయుడైన చిలకల రాజేశ్వరరెడ్డిని ఆ సంస్థకు ప్రత్యేక కమిషనర్‌గా నియమించుకుని టీడీపీ నేతలను టార్గెట్ చేస్తున్నారు. ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావును కూడా ఈ విభాగం ద్వారా కేసుల పెట్టి ఇబ్బందులు పెట్టారు. ఇప్పుడు మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు కుమారుడు శరత్ ను కేసులో ఇరికించి అరెస్టు చేశారు. శరత్ పనిచేసిన సంస్థలో కేవలం 68 రోజులు మాత్రమే అడిషనల్ డైరెక్టర్‌గా విధులు నిర్వహించారు. అయినా APSRDI డిప్యూటీ డైరెక్టర్ సీతారామ్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదుతో జరిమానా విధించి విచారణ జరుపుతోంది” అన్నారు.

“కేంద్ర సంస్థ అయిన డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ జిఎస్టి ఇంటలిజెన్స్ విచారణ చేస్తుండగానే మళ్లీ అదే అంశాన్ని APSRDI విచారణకు స్వీకరించడం ఆశ్చర్యంగా ఉంది. టీడీపీ నేతలు, కుటుంబ సభ్యులే లక్ష్యంగా తప్పుడు కేసులను ప్రభుత్వం బనాయిస్తోంది. రాష్ట్రంలో APSDRI ఎందుకు స్థాపించారు.. దాని లక్ష్యాలు ఏమిటి? కేవలం టీడీపీ నేతలను వేధించడమే APSDRI పనా? APSDRI రాష్ట్రంలో ఏర్పడ్డాక ఎన్ని కేసులు నమోదు చేసింది? ప్రభుత్వం సీఐడీని జేబు సంస్థగా మార్చుకుని ఇప్పటికే ప్రత్యర్థి పార్టీ నేతలను కేసుల పెట్టి వేధిస్తోంది. ఇప్పుడు మళ్లీ కొత్తగా APSDRI ద్వారా ప్రత్యర్థులను ఆర్థికంగా, రాజకీయంగా బలహీనపరిచే కుట్ర చేస్తోంది. ఇప్పటికే రాష్ట్రంలో APSDRI వేధింపులు భరించలేక పలువురు వ్యాపారవేత్తలు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ ఓడిపోతుందనే భయంతో టీడీపీ నేతలను టార్గెట్ చేసి వేధిస్తున్నారు. ఇలాంటి చట్టవ్యతిరేక పనులు ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. APSDRIని దుర్వినియోగం చేసే ప్రభుత్వం చర్యను నిలువరించాలి” అని చంద్రబాబు(Chandrababu) కోరారు. కాగా జీఎస్టీ ఎగవేతకు పాల్పడ్డారనే ఆరోపణలపై శరత్‌ను పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.

Read Also: జగన్ కి పాలించే హక్కు లేదు.. వివేకా కేసులో సంచలన నిజాలు బయటపెట్టిన సునీత
Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Dandruff | ఈ చిట్కాలతో వారం రోజుల్లో చుండ్రుకు చెక్..

చుండ్రు(Dandruff) ప్రస్తుతం అనేక మందిని సతాయిస్తున్న సమస్య. దీనికి ఎన్ని రకాల...

HYDRA | ఆ భవనాలను హైడ్రా కూల్చదు: రంగనాథ్

గ్రేటర్ పరిధిలో హైడ్రా(HYDRA) చేపడుతున్న కూల్చివేతలపై తాజాగా హైడ్రా కమిషనర్ రంగనాథ్...