TDP-BJP-Janasena | బీజేపీ-జనసేనతో కలిసి ఎన్నికలకు వెళ్తున్నాం: చంద్రబాబు

-

ఎన్డీఏలోకి తెలుగుదేశం వెళ్తుందని ఆ పార్టీ అధినేత చంద్రబాబు స్పష్టంచేశారు. టీడీపీ సీనియర్ నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన చంద్రబాబు బీజేపీతో పొత్తుపై కీలక ప్రకటన చేశారు.

- Advertisement -

‘మనం ఎన్డీఎలోకి వెళుతున్నాం.. సీట్ల సర్దుబాటు కూడా కుదిరింది. పొత్తులపై కూడా త్వరలోనే అధికారిక ప్రకటన వస్తుంది. బీజేపీకి 6 అసెంబ్లీ, 5 లోక్‌సభ సీట్లు ఇచ్చాం. బీజేపీ, జనసేనతో కలిసి ఎన్నికలకు వెళ్తున్నాం. ఐదేళ్లలో ఏపీని జగన్‌ దివాళా తీయించారు. ఈ పరిస్థితుల్లో ఏపీకి కేంద్ర సహకారం చాలా అవసరం. ఆర్థిక విధ్వంసం నుంచి కోలుకోవాలంటే కేంద్రంతో కలిసి ఉండాలి. రాష్ట్ర ఉజ్వల భవిష్యత్, విభజన హామీలు నెరవేర్చడం, అరాచక పాలనను అంతమొందించడం కోసమే బీజేపీతో పొత్తు పెట్టుకుంటున్నాం. సోమవారం మిగతా అభ్యర్దుల జాబితా ప్రకటన ఉండొచ్చు. పార్టీలో టిక్కెట్లు రాని, అసంతృప్తిగా ఉన్న వారిని వెంటనే సీనియర్లు.. పిలిపించి మాట్లాడండి’ అని తెలిపారు.

మూడు రోజులుగా ఢిల్లీ పర్యటనలో ఉన్న చంద్రబాబు, పవన్ కల్యాణ్‌.. ఒకటికి రెండు సార్లు కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డాతో భేటీ అయ్యారు. సీట్ల సర్దుబాటుపై ప్రధానంగా చర్చించారు. బీజేపీకి 5 ఎంపీ సీట్లు, 6 అసెంబ్లీ స్థానాలు ఇచ్చేందుకు చంద్రబాబు అంగీకారం తెలిపారు. చర్చలు విజయవంతం కావడంతో ఎన్డీఏలోకి తిరిగి టీడీపీని అమిత్ షా ఆహ్వానించారు. దీంతో ఈ నెల 14న జ‌రిగే ఎన్డీఏ స‌మావేశానికి చంద్రబాబు హాజరుకానున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

NTR ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. 3 అప్డేట్స్ కి రెడీ గా ఉండండి

ఎన్టీఆర్(Jr NTR) హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా 'దేవర'....

THSTI లో ప్రాజెక్ట్ రీసెర్చ్ స్టాఫ్ కి నోటిఫికేషన్

ఫరీదాబాద్ (హరియాణా)లోని ప్రభుత్వరంగ సంస్థకు చెందిన ట్రాన్టేషనల్ హెల్త్ సైన్స్ అండ్...