తనకు ఇంగ్లీష్ రాదని ఒప్పుకున్న డిప్యూటీ సీఎం

తనకు ఇంగ్లీష్ రాదని ఒప్పుకున్న డిప్యూటీ సీఎం

0
88

ఏపీ డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి సంచలన వ్యాఖ్యలు చేశారు… తాజాగా ఆమె బూసరాజుపల్లి గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలలో జరిగిన మనబడి నాడు నేడు కార్యక్రమం నిర్వహించారు… ఆ కార్యక్రమానికి పుష్ప శ్రీవాణి పాల్గొన్నారు…

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ…తాను పదవి తరగతి వరకు తెలుగు మీడియం వరకు చదివానని ఆ తర్వాత ఇంటర్ లో ఇంగ్లీష్ మీడియంలో మూడు నెలలు చదివి తెరిగి తెలుగు మీడియంలో చేరానని తెలిపారు… దాని తర్వాత డిగ్రీలో ఇంగ్లీష్ మీడియంలో చదివానని ఆ భాషపై తాను పట్టు సాధించలేక పోయానని అన్నారు..

తాను చదువుతున్న సమయంలో ఇంగ్లీష్ రాక తాను ఎంతో ఇబ్బంది పడ్డానని అన్నారు… ఇప్పుడు ఆ బాధ ఎవ్వరికి ఉండదని అన్నారు… రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియంను అమలు చేస్తున్నామని అన్నారు…