Game Changer | యూట్యూబ్‌లో దుమ్మురేపుతున్న ‘జరగండి’ లిరికల్ సాంగ్

-

మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్‌ దిగ్గజ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో ‘గేమ్ ఛేంజర్(Game Changer)’మూవీలో నటిస్తున్న సంగతి తెలిసిందే. పొలిటికల్ బ్యాక్‌డ్రాప్‌తో తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్ రెండేళ్ల నుంచి జరుగుతూనే ఉంది. ఇప్పటివరకు మూవీ టైటిల్ పోస్టర్ తప్ప ఏ అప్‌డేట్ రాకపోవడంతో అభిమానులు తీవ్ర నిరాశతో ఉన్నారు.

- Advertisement -

Game Changer | తాజాగా చెర్రీ పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ ‘జరగండి’ అంటూ సాగే ఫస్ట్ లిరికల్ సాంగ్ విడుదల చేశారు. థమన్ సంగీతం అందించిన ఈ పాటకు అనంత్ శ్రీరామ్ లిరిక్స్ అందించడగా దలేర్ మెహందీ, సునిధి చౌహన్ పాడారు. ఇక ప్రభుదేవా డ్యాన్స్ కొరియోగ్రఫీ చేశారు. ముఖ్యంగా అద్భుతమైన సెట్టింగ్స్‌తో విజువల్ వండర్‌గా ఈ పాటను తెరకెక్కించారు. ప్రస్తుతం యూట్యూబ్‌లో ఈ పాట రికార్డుల మోత మోగిస్తోంది.

ఇక చెర్రీ సినిమాల విషయానికొస్తే క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నట్లు తాజాగా ప్రకటించారు. దీంతో ‘రంగస్థలం’ కాంబో మరోసారి రిపీట్ కానుంది. ఇక ‘ఉప్పెన’ డైరెక్టర్ బుచ్చిబాబు దర్శకత్వంలోనూ నటిస్తున్నారు. ఇటీవలే ఈ మూవీ పూజా కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. ఈ మూవీలో చరణ్ సరసన శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటించనుంది.

Read Also: ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సద్గురు ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్..
Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Google Wallet | ఆండ్రాయిడ్ యూజర్లు కోసం గూగుల్ వాలెట్ వచ్చేసింది

టెక్ దిగ్గజం google బుధవారం ఆండ్రాయిడ్ యూజర్లకు గూగుల్ వాలెట్(Google Wallet)...

Akshaya Tritiya | అక్షయ తృతీయ రోజు ఎన్ని ప్రత్యేకతలు ఉన్నాయో తెలుసా?

వైశాఖ శుద్ధ తదియను "అక్షయ" తృతీయగా(Akshaya Tritiya) వ్యవహరిస్తారు. అక్షయం అంటే...