బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ జిల్లాల పర్యటనకు(KCR Districts Tour) సిద్ధమయ్యారు. ఎండిపోయిన పొలాలను పరిశీలించి రైతులకు భరోసా కల్పించనున్నారు. సూర్యాపేట, నల్లగొండ, జనగామ జిల్లాల్లోని పలు మండలాల్లో పర్యటించనున్నారు. ఈ మేరకు షెడ్యూల్ ఖరారైంది.
“ఆదివారం ఉదయం 8:30 గంటలకు ఎర్రవెల్లి నుంచి రోడ్డు మార్గంలో కేసీఆర్ బయల్దేరనున్నారు. జనగామ జిల్లాలోని ధరావత్ తండాకు ఉదయం 10 గంటల 30 నిమిషాలకు చేరుకుని ఎండిపోయిన పంట పొలాలను పరిశీలించనున్నారు. అనంతరం 11 గంటల 30 నిమిషాలకు సూర్యాపేట జిల్లాలోని తుంగతుర్తి మండలం, అర్వపల్లి మండలం, సూర్యాపేట రూరల్ మండలాల్లో పర్యటించి.. ఎండిపోయిన పంట పొలాలను పరిశీలిస్తారు. మధ్యాహ్నం 1 గంటకు సూర్యాపేట రూరల్ మండలం నుంచి బయల్దేరి.. 1.30గంటల వరకు సూర్యాపేట నియోజకవర్గంలోని ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసుకు చేరుకుంటారు.
KCR Districts Tour | మధ్యాహ్నం 2 గంటలకు ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసులోనే లంచ్ చేయనున్నారు. తదుపరి 3 గంటలకు మీడియా సమావేశం నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 3.30 గంటలకు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసు నుంచి నల్గొండ జిల్లాకు బయల్దేరుతారు. సాయంత్రం 4.30 గంటలకు నిడమనూరు మండలానికి చేరుకుని ఎండిపోయిన పంటలను పరిశీలించనున్నారు. సాయంత్రం 6 గంటలకు నిడమనూరు నుంచి ఎర్రవెల్లికి బయల్దేరనున్నారు. రోడ్డు మార్గం గుండా ప్రయాణించి రాత్రి 9 గంటలకు ఫామ్‌హౌస్‌కు చేరుకోనున్నారు.” అని ఆయన కార్యాలయం ప్రకటన విడుదల చేసింది.