YS Sharmila | పులివెందులలో షర్మిల పర్యటనను అడ్డుకున్న వైసీపీ శ్రేణులు

-

సొంత చిన్నాన్న వివేకానందరెడ్డికే న్యాయం చేయని జగనన్న ప్రజలకు ఏం న్యాయం చేస్తారని ఏపీసీసీ చీఫ్‌ వైఎస్‌ షర్మిల (YS Sharmila) ప్రశ్నించారు. పులివెందుల నియోజకవర్గం వేంపల్లెలో నిర్వహించిన ప్రచార కార్యక్రమంలో ఆమె మాట్లాడారు.

- Advertisement -

“రాముడికి లక్ష్మణుడు ఎలాగో.. వైఎస్‌ఆర్‌కు వివేకా అలాంటి వారే అని.. అలాంటి వ్యక్తిని దారుణంగా చంపేశారని మండిపడ్డారు. ప్రజల మనిషి వివేకాను ఘోరంగా నరికి చంపేశారు. ఆయన గొడ్డలి పోట్లకు బలైపోయి ఐదేళ్లయింది. నేటి వరకు హత్య చేసిన వారికి, చేయించిన వారికి శిక్ష పడలేదు. నిందితులు యథేచ్ఛగా బయట తిరుగుతున్నారు. ఇక్కడి ఎంపీ అవినాష్‌రెడ్డి నిందితుడని సీబీఐ చెబుతోంది. డబ్బు లావాదేవీలు సహా అన్ని సాక్ష్యాలను సీబీఐ బయటపెట్టింది. కానీ సాక్షాత్తూ సీఎం జగన్‌ తన అధికారాన్ని అడ్డుపెట్టుకుని హంతకులను కాపాడుతున్నారు. హంతకులను కాపాడటం న్యాయమా? సొంత చిన్నాన్న కుటుంబానికే న్యాయం చేయకపోతే ఇంకెవరికి న్యాయం చేస్తారు? ప్రజలు నమ్మి అధికారం ఇస్తే.. హంతకుడిని కాపాడతారా?” అని ఆమె మండిపడ్డారు.

నేటి వరకు ఒక్కరోజు కూడా అవినాష్‌ను జైలుకు పంపలేదు. మళ్లీ అదే హంతకుడికి టికెట్‌ ఇస్తారా? హంతకులను కాపాడటానికా ప్రజలు మీకు అధికారం ఇచ్చింది.ఈ అన్యాయాన్ని తట్టుకోలేకనే మీ వైఎస్ఆర్ బిడ్డ కడప ఎంపీగా పోటీ చేస్తుంది. అధర్మాన్ని ఎదురించేందుకు ఎంపీగా నిలబడ్డా. ధర్మం వైపు మీ వైఎస్ఆర్ బిడ్డ.. అధర్మం వైపు హత్యా రాజకీయాలు చేస్తున్నవారు ఉన్నారు. ఓటర్లు ధర్మాన్ని గెలిపించాలని కోరుతున్నాను. ఒకవైపు వైఎస్‌ఆర్‌ బిడ్డ.. మరోవైపు హంతకుడు ఉన్నాడు. ఒకవైపు న్యాయం.. మరోవైపు అధికారం ఉన్నాయి. న్యాయం వైపు నిలబడిన నన్ను కడప ఎంపీగా గెలిపించి ఆశీర్వదించండి.” అని షర్మిల(YS Sharmila) కోరారు.

మరోవైపు ప్రచారంలో భాగంగా షర్మిల బస్సు యాత్రను వైసీపీ శ్రేణులు అడ్డుకున్నారు. పోలీసులు వెంటనే కలుగజేసుకుని వారిని పక్కకు నెట్టేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన షర్మిల “దమ్ముంటే పులివెందులకు రండి.. పూల అంగళ్ల దగ్గర పంచాయతీ పెడదాం.. వివేకాను ఎవరు హత్య చేశారో తేలుద్దాం. అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో వైసీపీకి ఓటమి భయం పట్టుకుంది. కడప లోక్ సభ స్థానం నుంచి బరిలోకి దిగిన అవినాష్ రెడ్డికి ఓటమి భయం ఉంది. తన పర్యటనకు అడ్డుపడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ జెండాలను తీసివేస్తున్నారు. ఒకప్పుడు జగన్‌కి చెల్లెను కాను బిడ్డను.. సీఎం అయిన తర్వాత ఆ బంధం తెగింది. బాబాయిని చంపిన వాళ్ళను పక్కన పెట్టుకున్నారు. మళ్ళీ టిక్కెట్ ఇచ్చారు అని” తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు.

Read Also: ఓటీటీలోకి వచ్చేసిన ‘యాత్ర2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?
Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Paris Olympics | పారిస్ ఒలింపిక్స్ జట్టులో తెలుగు తేజం

తెలుగు తేజం ఆకుల శ్రీజ టీమ్ విభాగంతో పాటు సింగిల్స్ లోనూ...

NTR ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. 3 అప్డేట్స్ కి రెడీ గా ఉండండి

ఎన్టీఆర్(Jr NTR) హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా 'దేవర'....