సికింద్రాబాద్ కంటోన్మెంట్ బీజేపీ అభ్యర్థి ఎవరంటే..?

-

సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే అభ్యర్థిని బీజేపీ ప్రకటించింది. మాజీ మంత్రి సదాలక్ష్మి, పద్మశ్రీ అవార్డు గ్రహీత టీవీ నారాయణ కుమారుడు వంశా తిలక్‌(Vamsha Tilak)ను తమ అభ్యర్థిగా వెల్లడించింది. దీంతో ఈ నియోజకవర్గంలో త్రిముఖ పోరు ఖాయమైంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ శ్రీ గణేష్‌ను తమ అభ్యర్థిగా ప్రకటించగా.. బీఆర్ఎస్ పార్టీ నివేదితను అభ్యర్థిగా ఖారురు చేసింది.

- Advertisement -

కాగా ఇటీవల రోడ్డు ప్రమాదంలో కంటోన్మెంట్ నియోజకవర్గ ఎమ్మెల్యే లాస్య నందిత మరణించిన సంగతి తెలిసిందే. దీంతో ఆ స్థానంలో ఉప ఎన్నిక అనివార్యమైంది. లాస్య మరణం నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం లోక్‌సభ ఎన్నికలతో పాటు కంటోన్మెంట్ అసెంబ్లీ ఉపఎన్నిక(Cantonment Bypoll)కు కూడా షెడ్యూల్ విడుదల చేసింది. మే 13న పోలింగ్ జరగనుంది. మరి ఈ ఎన్నికలో సానుభూతితో బీఆర్ఎస్ అభ్యర్థి నివేదితకు ప్రజలు ఓటు వేస్తారో.. లేదంటే కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులను గెలిపిస్తారో తెలియాలంటే జూన్ 4వరకు ఆగాల్సిందే.

Read Also: వైసీపీ అభ్యర్థికి 18నెలల జైలు శిక్ష.. విశాఖ కోర్టు సంచలన తీర్పు..
Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Dandruff | ఈ చిట్కాలతో వారం రోజుల్లో చుండ్రుకు చెక్..

చుండ్రు(Dandruff) ప్రస్తుతం అనేక మందిని సతాయిస్తున్న సమస్య. దీనికి ఎన్ని రకాల...

HYDRA | ఆ భవనాలను హైడ్రా కూల్చదు: రంగనాథ్

గ్రేటర్ పరిధిలో హైడ్రా(HYDRA) చేపడుతున్న కూల్చివేతలపై తాజాగా హైడ్రా కమిషనర్ రంగనాథ్...