ఏపీ, తెలంగాణలో మొదలైన నామినేషన్ల ప్రక్రియ

-

దేశవ్యాప్తంగా నాలుగో విడత స్వారత్రిక ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. ఈ విడతలో ఏపీ, ఒడిశా, అరుణాచల్‌ప్రదేశ్‌, సిక్కిం అసెంబ్లీలు సహా 10 రాష్ట్రాల్లో మొత్తం 96 ఎంపీ సీట్లకు ఎన్నికలు జరగనున్నాయి. అలాగే తెలంగాణలోని లోక్‌సభ ఎన్నికలతో పాటు సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నికకు నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు స్వీకరించనున్నారు. సెలవు రోజుల్లో మాత్రం నామినేష్లను స్వీకరించరు.

- Advertisement -

ఈనెల 25 వరకు నామినేషన్ల స్వీకరణ చేపట్టి.. 26న నామినేషన్లను పరిశీలించనున్నారు. ఈనెల 29 వరకు ఉపసంహరణకు గడువు విధించారు. అనంతరం ఫైనల్‌గా పోటీలో ఉన్న అభ్యర్థుల జాబితాను ఎన్నికల అధికారులు ప్రకటిస్తారు. మే 13న పోలింగ్ నిర్వహించి.. జూన్‌ 4న ఫలితాలు వెల్లడించనున్నారు. లోక్‌సభ స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులు జిల్లా కలెక్టరేట్లలో, అసెంబ్లీ స్థానాలకు పోటీ చేసే అభ్యర్థులు ఆయా నియోజకవర్గాల ప్రధాన కేంద్రాల్లో నామినేషన్‌ పత్రాలు సమర్పించాలి. లోక్‌సభ అభ్యర్థి రూ.25 వేలు, శాసనసభ అభ్యర్థి రూ.10 వేలు డిపాజిట్ చెల్లించాలి. ఇక ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు అయితే ఇందులో సగం చెల్లిస్తే సరిపోతుంది.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

40 ఏళ్లు పోలీసులను బురిడీ కొట్టించిన ఖైదీ

నలభై ఏళ్ల నుంచి బురిడీ కొట్టించి తప్పించుకుని తిరుగుతున్న ఖైదీ ఎట్టకేలకు...

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్

Indian Air Force Agnipath | అగ్నిపథ్ పథకంలో భాగంగా అగ్నివీర్...