వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మంత్రి ధర్మాన కృష్ణదాస్ టీడీపీ నాయకులకు రాజీనామా సవాల్ విసిరారు….. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ… టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు తాను ఇసుక విషయంలో అవినీతికి పాల్పడ్డానని అంటున్నారని ధర్మాన మండిపడ్డారు…
- Advertisement -
ఒక వేళ తాను అవినీతికి పాల్పడినట్లు అయితే ఆయన నిరూపించాలని డిమాండ్ చేశారు… అచ్చెన్నాయుడు నిరూపిస్తే తన మంత్రిపదవికి అలాగే రాజకీయాలనుంచి శాశ్వితంగా తప్పుకుంటానని సవాల్ చేశారు.. తాము వ్యవసాయం కుటుంబం నుంచి వచ్చిన వారమని అన్నారు ధర్మాన…
ప్రజలకోసం జగన్ మోహన్ రెడ్డి అనేక సంక్షేమ కార్యక్రమాలు చేస్తుంటే ప్రతిపక్షనేతలు ఓర్వలేక విమర్శలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు… తమ నేత ప్రజలకు ఇచ్చిన ప్రతీ హామీని అమలు చేస్తున్నారని ఆయన అన్నారు…