‘మరోసారి బీసీలను మోసం చేసేందుకు రేవంత్ సర్కార్ కుట్ర’ 

-

సమగ్ర కులగణన జరిపి, స్థానిక సంస్థల్లో బి.సి లకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని బి.సి జనసభ అద్యక్షులు రాజారామ్ యాదవ్ డిమాండ్ చేశారు. శనివారం ఉదయం హైదరాబాదులోని ఇందిరా పార్క్ వద్ద బి.సి కుల, సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో జరిగిన మహా ధర్నాకు ఆయన అధ్యక్షత వహించి మాట్లాడారు. రాహుల్ గాంధీ బి.సి లు ఎంతమందో వారికి అంత వాటా ఇస్తామని, రిజర్వేషన్లపై 50 శాతం సీలింగ్ ఎత్తి వేస్తామని చెప్పి దేశ వ్యాప్తంగా బి.సి ల ఓట్లతో మెజార్టీ సీట్లను గెలుచుకోవడమే కాకుండా రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిందని అన్నారు. బి.సి ఓట్లతో అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి బి.సి కులగణన, స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పించకుండానే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలనే కుట్ర చేస్తున్నారని ఆయన ఆరోపించారు. కామారెడ్డిలో సమగ్ర కులగణన అంటూ, గవర్నర్ తో బి.సి కులగణన అని అసెంబ్లీలో మాట్లాడించడం ఎలా సరైందని అన్నారు.

- Advertisement -

నొసలుతో ఒకటి, నోటితో మరొకటి మాట్లాడుతున్న రేవంత్ రాజకీయాలను బి.సి లు అర్థం చేసుకోవాలని అన్నారు. సమగ్ర కులజనగణన జరపకుండా ఎన్నికల్లోకి వెళ్లి చట్టపరమైన సమస్యలను సాకు చూపెట్టి బి.సి లకు అన్యాయం చేయాలని చూస్తున్న కాంగ్రెస్ పార్టీ కుట్రలను అర్థం చేసుకోవాలని అన్నారు. కాంగ్రెస్ పార్టీ చరిత్ర అంతా కూడా బి.సి లకు వ్యతిరేకంగానే జరిగిందని, కాకా కలేల్కర్ కమీషన్ నుండి మండల్ కమీషన్ వరకు బి.సి లకు వ్యతిరేకంగా పని చేసిన చరిత్ర కాంగ్రెస్ కు ఉందని ఉన్నారు. బి.సి లకు నష్టం చేసి రేవంత్ రెడ్డి ఏమి సాధిస్తారని, వివిధ కులాలుగా ఆయా వృత్తుల ద్వారా ఈ సమాజానికి ఎంతో మేలు చేస్తున్న బి.సి లకు అన్యాయం చేస్తే ఊరుకునేది లేదని, బి.సి శక్తిని రాజకీయ శక్తిగా మార్చి బి.సి వాటా సాధిస్తామని అన్నారు.

రాజ్యసభ సభ్యులు, బి.సి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ ఎన్నో ఏండ్లుగా ఈ దేశ పాలకులు బి.సి లను బిక్షగాళ్ళను చేసారని, బి.సి ఓట్లతో రాజ్యమలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం బి.సి లకు నష్టం చేస్తే ఊరుకునేది లేదని, ఎన్నో పోరాటాలు, ఎన్నో త్యాగాలు చేసిన చరిత్ర, హక్కుల కోసం రక్తం చిమ్మిన తెలంగాణ నేలపై బి.సి లకు అన్యాయం చేస్తే పాలకులు తగిన మూల్యం చెల్లించక తప్పదని ఆయన అన్నారు. రాహుల్ గాంధీ మాటను గౌరవించి బి.సి జనాభా ప్రకారం అన్ని రంగాల్లో అవకాశాలు కల్పించాలని, స్థానిక సంస్థల్లో బి.సి లకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. 76 ఏండ్లుగా అణచివేయబడిన బి.సి లు విజృభించడానికి సిద్ధంగా ఉన్నారని, బి.సి లను తక్కువ అంచనా వేస్తే ఊరుకునేది లేదని అన్నారు. బి.సి ల అభివృద్ధి పట్ల బిజెపి నిర్లక్ష్యాన్ని విడనాడాలని అన్నారు. ఎవరెవరికోసమో ప్రాణ త్యాగాలు చేసిన బి.సి సమాజం బి.సి విముక్తి పోరాటంలో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. 56 శాతం జనాభా గల బి.సి లాల్లో 14 శాతం మాత్రమే రాజకీయాల్లో ఉన్నారని, 56 శాతం ఉన్న బిసి లల్లో 9 మాత్రమే ఉద్యోగాల్లో ఉన్నారని, 100 మంది కేంద్ర కార్యదర్శుల్లో ముగ్గురే బి.సి లు ఉన్నారని, కార్పొరేట్ వ్యాపారుల్లో 1 శాతం కూడా లేరని అన్నారు. ఇంతటి స్థితిని మార్చడం కోసం బి.సి లు మిలిటెంట్ ఉద్యమాలు చేయడానికి సిద్ధం కావాలని అన్నారు. కామారెడ్డి డిక్లరేషన్ లో తెలిపిన అన్ని అంశాలను అమలు పరచాలని, సమగ్ర కులగనన జరిపి స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని, రాజ్యాంగ హక్కుల కోసం, న్యాయమైన వాటా కోసం బి.సి మరో పోరాటానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆల్ ఇండియా ఒబిసి జాక్ చైర్మన్ సాయిని నరేందర్ మాట్లాడుతూ స్థానిక సంస్థల నుండి చట్ట సభల వరకు అన్ని స్థాయిల్లో బి.సి లకు అవకాశాలు రావలంటే సమగ్ర కుల జనగణన అవసరమని, సకల సామాజిక రంగాల్లో జనాభా దామాషా ప్రకారం వాటా దక్కాలంటే బి.సి లు ఐక్య ఉద్యమాలు చేయాలని పిలుపునిచ్చారు.

మాజీ రాజ్యసభ సభ్యులు రాపోలు ఆనంద భాస్కర్ మాట్లాడుతూ కొత్తగా ఏర్పడిన బిజెపి ప్రభుత్వానికి రెండు కాళ్ళు లేకుండా, ఉత్తరప్రదేశ్ లో బిజెపిని దుర్మార్గాన్ని తిప్పికొట్టి, దేశ ప్రధానికీ ఓటమి చెమటలు పట్టించిన శక్తి బి.సి లదని ఆయన అన్నారు. పంచాయితీల్లో సర్పంచ్ లు లేకుంటే కేంద్ర నిధులు రాకపోవచ్చు కానీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఎన్నికల హామీ అయినా స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో బి.సి కుల జనగణన గురించి ఎన్నో మార్లు మాట్లాడిన రాహుల్ గాంధీ చొరవ తీసుకొని తెలంగాణలో శాస్త్రీయమైన సమగ్ర కులజనగణన జరిపి స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని చేసారు. ఈ బి.సి ఐక్య ఉద్యమాలు మరింత బలపడి రాజ్యాధికారం చేపట్టే శక్తిగా మారాలని పిలుపునిచ్చారు.

బి ఆర్ ఎస్ నాయకులు డాక్టర్ ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ అంబేద్కర్ కృషి వల్ల రాజ్యాంగంలో బి.సి కమీషన్లు వేసుకునే అవకాశం వచ్చిందని, నెహ్రూ నాయకత్వంలో కాకా కలేల్కర్ కమీషన్ నివేదిక, ఇందిరా నాయకత్వంలో మండల్ కమేషన్ నివేదికను బుట్టదాఖలు చేసారని విమర్శించారు. మండల్ కమీషన్ అమలు చేసిన వి.పి సింగ్ ప్రభుత్వానికి బిజెపి ప్రభుత్వం మద్దతు ఉపసంహరించుకోగా రాజీవ్ గాందీ వ్యతిరేకించారని అన్నారు. దేశానికి 1947 లో స్వాతంత్రం వస్తె బి.సి లకు 1995 లో అవకాశాలు మొదలయ్యాయని, 2008 నుండే బి.సి లకు కేంద్ర ప్రభుత్వంలో విద్యా, ఉద్యోగాల్లో అవకాశాలు కల్పించబడ్డాయని, చట్టాలు, న్యాయవ్యవస్థను అడ్డు పెట్టుకొని బి.సి లకు అన్యాయం చేస్తున్నారని, బహుజన వర్గాలకు వ్యతిరేకంగా తీర్పులిచ్చే న్యాయమూర్తుల్లో బి.సి లు లేరని, నేటికీ 79 శాతం న్యాయమూర్తులు ఆధిపత్య వర్గాల వారే ఉన్నారని అన్నారు. కామారెడ్డి డిక్లరేషన్ లో చెప్పి ఆరు నెలలు అయినా ఆ డిక్లరేషన్ లో ఏ ఒక్క అంశంపై కనీసం కదలిక లేదంటే మీ చిత్తశుద్ధి అర్థమవుతుందని ఆయన అన్నారు. బి.సి హక్కుల సాధన కోసం తెలంగాణ ఉద్యమం లాగా గ్రామ గ్రామాన ఉద్యమించాల్సిన అవసరముందని 46, 340 ఆర్టికల్స్ ప్రకారం బి.సి లకు రావల్సిన హక్కులను సాధించాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమానికి స్వాగతోపన్యాసం మేకల కృష్ణ చేయగా ఆల్ ఇండియా ఒబిసి జాక్ చైర్మన్ సాయిని నరేందర్, హిందూ బి.సి మహాసభ రాష్ట్ర అద్యక్షులు బత్తుల సిద్ధేశ్వర్లు, మున్నూరుకాపు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సర్దార్ పుటం పురుషోత్తం, బి.సి కమీషన్ మాజీ సభ్యులు గౌరీ శంకర్, ముఠా జయసింహ, ఎంబిసి నాయకులు కొల్లూరు సత్యనారాయణ, రజక రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు చాపర్తి కుమార్ గాడ్గే, వళ్ళాల జగన్ గౌడ్, పొన్నం మహేశ్ గౌడ్, న్యాయవాది రాచకొండ ప్రవీణ్ కుమార్, వివిధ సంఘాల నాయకులు న్యాయవాది గుండ్రాతి శారద గౌడ్ ఏటిగడ్డ అరుణ, అచ్చ నాగమణి, శ్రీహరి యాదవ్, దేశం మహేష్ గౌడ్, దత్తాత్రేయ, వజ్జ ధనుంజయ, కరుణాకర్ ముదిరాజ్, జైహింద్ గౌడ్, అశోక్ పోచం, నాగేందర్ గౌడ్, నిమ్మల వీరన్న, అంబాల నారాయణ గౌడ్, అశోక్ యాదవ్, కిరణ్ కుమార్, గుండ్రాతి శారద గౌడ్, గడ్డం శ్రీనివాస్ యాదవ్, సంజీవ్ నాయక్, రాంచందర్ నాయక్, హరిప్రసాద్, గడ్డం శ్రీనివాస్ యాదవ్, లింగం శాలివాహన, రత్నం చారి, ఐలేశ్ యాదవ్, గంటా రాములు యాదవ్, రాజు గౌడ్, మధు, నాగారపు సత్యం యాదవ్, గిరబోయిన శ్రీనివాస్ యాదవ్, పోతరబోయిన రాజయ్య, బద్దుల రాజ్ కుమార్, నానబోయిన రవి, దాసరి కోటి తదితరులు పాల్గొనగా పోచబోయిన శ్రీహరి యాదవ్ వందన సమర్పణ తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Sesame Seeds | చలికాలంలో తెల్ల నువ్వులు ఎంత మ్యాజిక్ చేస్తాయో తెలుసా..

Sesame Seeds | చలికాలంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా పెద్ద టాస్క్...

Jagapathi Babu | రేవతి కుటుంబాన్ని నేను పరామర్శించా: జగపతిబాబు

Jagapathi Babu | సంధ్య థియేటర్ ఘటన రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా...